Thalapathy Vijay: మరోసారి మనసులను గెలుచుకుంటున్న హీరో విజయ్.. ఆ విద్యార్థులను సన్మానించనున్న దళపతి
Thalapathy Vijay: హీరో దళపతి విజయ్.. కొందరు విద్యార్థులను సన్మానించనున్నారు. చెన్నైలో ఈనెల 17న ఈ కార్యక్రమం జరగనుంది. పూర్తి వివరాలు ఇవే.
Thalapathy Vijay: తమిళ హీరో ‘దళపతి’ విజయ్‍కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కోలీవుడ్‍లో టాప్ హీరోగా ఆయన ఉన్నారు. కోట్లాది అభిమానులు ఆయనను ప్రాణంగా భావిస్తారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమాలో విజయ్ నటిస్తున్నారు. ఈ మూవీ అప్‍డేట్‍ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో విజయ్ నుంచి తాజాగా ఓ విభిన్నమైన సమాచారం వచ్చింది. అయితే, ఇది సినిమా గురించి కాదు. దళపతి విజయ్.. కొందరు విద్యార్థులను సన్మానించనున్నారు. జూన్ 17వ తేదీన చెన్నైలో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ వివరాలను హీరో విజయ్.. అధికార ప్రతినిధి ప్రకటించారు. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
స్ఫూర్తివంతమైన పనితో అభిమానులు, ప్రజల మనసులను దళపతి విజయ్ మరోసారి గెలుచుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్, మూడో స్థానాల్లో నిలిచిన విద్యార్థులను హీరో విజయ్ గౌరవించనున్నారు. ఈనెల 17న చెన్నైలో జరిగే కార్యక్రమంలో ఆ విద్యార్థులను సన్మానించనున్నారు.
ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో పాటు నియోజకవర్గ టాపర్లైన ఆ విద్యార్థులు హాజరుకానున్నారు. స్టూడెంట్లకు సర్టిఫికేట్లు, సన్మానంతో పాటు నగదు ప్రోత్సహకాలను కూడా విజయ్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. చెన్నై నీలగిరిలోని ఆర్‌కే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని విజయ్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు.
దళపతి విజయ్ రాజకీయ రంగం ప్రవేశంపై ఇంకా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ (VMI) పార్టీ నుంచి కొందరు అభ్యర్థులు బరిలో ఉంటారని వాదనలు ఉన్నాయి.
ప్రస్తుతం, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు విజయ్. ఈ మూవీలో త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్‍లో మరో మూవీ కూడా చేయనున్నారు విజయ్. ఈ చిత్రానికి సీఎస్‍కే అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ టీమ్ అయిన ‘చెన్నై సూపర్ కింగ్స్’ షార్ట్ నేమ్ సీఎస్‍కే పేరునే ఖరారు చేసినట్టు సమాచారం.
సంబంధిత కథనం