The Goat Day 1 Collection: విజయ్ ది గోట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - వంద కోట్లు అనుకుంటే వచ్చింది సగమే - ఎపిక్ డిజాస్టర్
The Goat Day 1 Collection: విజయ్ ది గోట్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక చతికిలాపడింది. గురువారం వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ యాభై ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు. తెలుగు వెర్షన్ మొదటిరోజు 2.25 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.
The Goat Day 1 Collection: దళపతి విజయ్ ది గోట్ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. విజయ్ మూవీ రికార్డులు సృష్టిస్తుందని, వంద కోట్లకుపైనే కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాటిని పూర్తిగా తలక్రిందులు చేస్తూ తొలిరోజు ఈ మూవీ ఇండియావైడ్‌గా 55 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. విజయ్ గత మూవీ లియో తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 63 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. లియో మూవీ రికార్డును ది గోట్ దాటలేకపోయింది.
తెలుగులో వచ్చింది ఎంతంటే?
తమిళంలో మోస్తారు వసూళ్లను రాబట్టిన ది గోట్ తెలుగులో పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమాపై తెలుగులో పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై పడింది. తొలిరోజు తెలుగులో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీ కేవలం మొత్తం 2.90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇందులో తెలుగు వెర్షన్ వాటా 2.25 కోట్లు ఉండగా...తెలుగు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ మరో అరవై ఐదు లక్షల వరకు వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. దళపతి విజయ్ డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ది గోట్ నిలిచింది. సినిమాపై ఉన్న నెగెటివ్ కారణంగా శుక్రవారం రోజు కలెక్షన్స్ మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తండ్రీకొడుకులుగా...
ది గోట్ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. మీనాక్షి చౌదరి, స్నేహా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో త్రిష ఐటెంసాంగ్ చేసింది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్‌తో పాటు పలువురు సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.
యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్...
విజయ్ యాక్టింగ్, మ్యానరిజమ్స్‌తో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటూ అభిమానులు చెబుతోన్నారు. అయితే వెంకట్ ప్రభు అందించిన కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు విజయ్ లుక్ విషయంలో విమర్శలొస్తున్నాయి.
ది గోట్ కథ ఇదే...
తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు కథతో దర్శకుడు వెంకట్ ప్రభు ది గోట్ సినిమాను రూపొందించాడు. గాంధీ (దళపతి విజయ్) యాంటీటెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తుంటాడు. తన జాబ్ గురించి భార్య అను ( స్నేహ) దగ్గర గాంధీ దాచిపెడతాడు.
ఓ సీక్రెట్ మిషన్‌లో జరిగిన ఎటాక్‌లో కొడుకు జీవన్‌ను (విజయ్)కోల్పోతాడు గాంధీ. భర్త జాబ్ వల్లే కొడుకు చనిపోయాడనే కోపంతో గాంధీకి దూరంగా వెళ్లిపోతుంది అను. కొడుకు దూరమైన బాధలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాబ్ వదిలేస్తాడు గాంధీ. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పనిచేయడం మొదలుపెడతాడు.
పదిహేనేళ్ల తర్వాత చనిపోయాడని అనుకున్న కొడుకు జీవన్‌ను అనుకోకుండా గాంధీ కలుస్తాడు. జీవన్ తిరగొచ్చిన తర్వాత గాంధీ లైఫ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. అతడి సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.
ఈ హత్యలు చేస్తుంది ఎవరు? గాంధీ తలపెట్టిన ఓ సీక్రెట్ మిషన్ నుంచి ప్రాణాలతో బయటపడిన మీనన్(మోహన్)అతడిపై రివేంజ్ తీర్చుకోవానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? తాను వెతుకుతున్న శత్రువు కొడుకు జీవన్ అని తెలిసి గాంధీ ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
350 కోట్ల బడ్జెట్...
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ది గోట్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.