Thalapathy Vijay The GOAT: రెండు పాటలు పాడిన దళపతి విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విశేషాలు-thalapathy vijay sings two songs for the greatest of all time movie reveals yuvan shankar raja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay The Goat: రెండు పాటలు పాడిన దళపతి విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విశేషాలు

Thalapathy Vijay The GOAT: రెండు పాటలు పాడిన దళపతి విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విశేషాలు

Hari Prasad S HT Telugu
May 27, 2024 10:39 AM IST

Thalapathy Vijay The GOAT: దళపతి విజయ్ తన నెక్ట్స్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం రెండు పాటలు పాడాడట. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కన్ఫమ్ చేశాడు.

రెండు పాటలు పాడిన దళపతి విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విశేషాలు
రెండు పాటలు పాడిన దళపతి విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విశేషాలు

Thalapathy Vijay The GOAT: దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటిస్తున్న చివరి సినిమాల్లో ఒకటి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్). వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం అతడు రెండు పాటలు పాడినట్లు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వెల్లడించాడు. ఇప్పటికే విజిల్ పోడు సాంగ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

దళపతి విజయ్ సాంగ్స్

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో విజయ్ ఒకే పాట పాడినట్లు అనుకున్నారు. కానీ ఇందులో మరో పాటను కూడా విజయ్ పాడినట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా చెప్పాడు. ఇందులో తొలి పాట విజిల్ పోడు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోపాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

తాను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచే నటనతోపాటు పాటలు కూడా పాడుతున్న విజయ్.. ఇలా ఒకే సినిమాలో రెండు పాటలు పాడటం ఇది మూడోసారి మాత్రమే. 1994లో తొలిసారి తాను నటించిన రసీగన్ మూవీలో విజయ్ ఓ పాట పాడాడు. ఆ తర్వాత 2005 వరకు వరుసగా 25 పాటలు పాడుతూ వచ్చాడు. అప్పుడు బ్రేక్ తీసుకొని 2012లో మరోసారి తుపాకీ మూవీలో ఓ పాట పాడాడు.

అప్పటి నుంచీ ప్రతి ఏటా తన సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా పాడుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో మాత్రం రెండు పాటలు పాడటం విశేషం. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. జయరాం, స్నేహ, లైలా, యోగి బాబులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ

ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జానర్ లో వస్తున్న మూవీ. ఇందులో విజయ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచీ దీనిపై ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కుల ధర విషయంలోనూ వస్తున్న వార్తలు షాకింగా ఉన్నాయి.

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.110 కోట్లు పెట్టినట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మూవీయే అయినా.. ఈ స్థాయి ధర మాత్రం ఊహించనిదే. ఇప్పటికే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసింది.

శాటిలైట్, ఓటీటీ హక్కుల అమ్మకం ద్వారానే మేకర్స్ కు రూ.200 కోట్లు రావడం విశేషం. ఇక థియేట్రికల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ సై-ఫి యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ ఒక యువకుడు, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. యుక్త వయసు పాత్ర కోసం ఏఐ సాయంతో డీఏజింగ్ కూడా చేస్తున్నారు. దళపతి విజయ్ కెరీర్లో ఇది 68వ సినిమాగా రానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024