Thalapathy Vijay: దళపతి విజయ్ నిరాకరించిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. సూర్యను వరించిన అదృష్టం
Thalapathy Vijay: తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ స్టార్ హీరో. అయితే తన కెరీర్లో మరో రేంజ్ కు ఎదిగే అవకాశం ఉన్న కొన్ని సూపర్ హిట్ సినిమాలను అతడు వద్దనుకున్నాడు.
Thalapathy Vijay: ఎంత పెద్ద హీరో అయినా కథల విషయంలో వాళ్ల జడ్జ్‌మెంట్ లెక్క తప్పుతూనే ఉంటుంది. చెత్త సినిమాలను అంగీకరించడం, సూపర్ హిట్ కథలను వద్దనుకోవడం సహజమే. అలా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా తన కెరీర్లో కొన్ని సినిమాలను వద్దనుకున్నాడు. కథ నచ్చక వదిలేసిన ఆ సినిమాలు తర్వాత సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దామా?
విజయ్ నిరాకరించిన సినిమాలు ఇవే
సింగం - విజయ్ నుంచి సూర్యకు..
తమిళ హీరో సూర్య కెరీర్లో సింగం ఫ్రాంఛైజీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. తొలిసారి 2010లో సింగం మూవీ వచ్చింది. ఆ తర్వాత ఇదే ఫ్రాంఛైజీ నుంచి మరో రెండు మూవీస్ కూడా వచ్చాయి. ఈ సినిమాలు తెలుగులో డబ్ అవడంతోపాటు హిందీ రీమేక్స్ లోనూ హిట్ అయ్యాయి. అలాంటి సినిమాను దళపతి విజయ్ వదులుకున్నాడు.
ముధల్వన్ (ఒకే ఒక్కడు)
1999లో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఒకే ఒక్కడు మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ముధల్వన్ పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమాను శంకర్ మొదట దళపతి విజయ్ కే ఆఫర్ చేశాడట. కానీ అప్పట్లో తాను రాజకీయాలతో సంబంధం ఉన్న సినిమాలు తీయబోనని చెప్పడంతో ఆ మూవీ అర్జున్ కు వెళ్లింది. ఇప్పుడదే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఓ పార్టీ కూడా పెట్టడం విశేషం.
ధూల్ -విక్రమ్‌కు ఛాన్స్
విక్రమ్, జ్యోతిక నటించిన మూవీ ధూల్. ఈ సినిమాను కూడా డైరెక్టర్ ధరణి మొదట విజయ్ కే చెప్పినా.. స్క్రిప్ట్ లో అంత బలం లేదని భావించిన అతడు నిరాకరించాడు. ఆ తర్వాత ఈ సినిమా హిట్ అయింది.
సందకోళి (పందెం కోడి)
2005లో వచ్చిన పందెం కోడి మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హిట్ అయింది. ఈ సినిమాను అయితే విజయ్ మరీ దారుణంగా ఫస్ట్ హాఫ్ వినగానే నిరాకరించాడట. దీంతో డైరెక్టర్ లింగు స్వామి విశాల్ దగ్గరకు వెళ్లాడు. అతని కెరీర్ ను మలుపు తిప్పి తెలుగులో అభిమానులను సంపాదించి పెట్టిన సినిమా ఇది.
ధీనా - అజిత్ చేతికి..
2001లో వచ్చిన మూవీ ధీనా. మురగదాస్ డైరెక్టర్. ఈ సినిమాను అతడు ముందుగా దళపతి విజయ్ కే చెప్పినా అతడు మాత్రం వద్దన్నాడు. దీంతో అజిత్ ను పెట్టి తీశాడు. అది హిట్ అయింది.
ఆటోగ్రాఫ్ - డైరెక్టరే హీరో
డైరెక్టర్ చరణే హీరోగా నటించిన మూవీ ఆటోగ్రాఫ్. 2004లో రిలీజైంది. తెలుగులో రవితేజ ఈ మూవీని నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమాను కూడా తమిళంలో మొదట దళపతి విజయ్ తోపాటు ప్రభుదేవా, అరవింద్ స్వామిలకు వినిపించాడు డైరెక్టర్. కానీ వాళ్లు నిరాకరించడంతో తానే హీరోగా చేసి హిట్ కొట్టాడు.
ఇలా దళపతి విజయ్ కెరీర్లో కొన్ని హిట్ సినిమాలను ఇతర హీరోలకు మిస్ చేసుకున్నాడు.
టాపిక్