Ranjithame Telugu Version Release: ఇళయ దళపతి విజయ్ హీరోగా.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారిసు. ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రంజితమే అనే సాంగ్ విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అయితే కేవలం తమిళం వెర్షన్ మాత్రమే విడుదలైన ఈ పాట.. తాజాగా తెలుగు వెర్షన్‌లోనూ వచ్చేసింది.
రంజితమే తెలుగు వెర్షన్ కూడా అదిరిపోయింది. ఏదో అనువాద పాటలాగా కాకుండా.. అర్థమవంతమైన తెలుగు పాట మాదిరిగా ఉంది. బొండు మల్లే చెండు తెచ్చి అంటూ ఆరంభమయ్యే ఈ పాటు శ్రోతలను అలరిస్తోంది. ఈ సాంగ్‌ను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాయగా.. అనురాగ్ కులకర్ణ, ఎంఎం మానసి ఆలపించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు.
విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, జయసుధ, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటిగ్ బాధ్యతలు తీసుకోగా.. కార్తిక్ పలనీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ బెల్టులో విజయ్‌కున్న పాపులారిటీ మేరకు అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో ఎక్కువ మంది ఆత్రుతగా చూస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ శింబు కూడా ఓ సాంగ్ పాడబోతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం