Leo Tv Premiere Date: దళపతి విజయ్ లియో మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న జెమిని టీవీలో లియో టెలికాస్ట్ కానుంది. లియో మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
దాదాపు 275 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 615 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023లో అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ మూవీగా నిలిచింది. తెలుగులో నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. లియో మూవీలో పార్తిబన్, లియో అనే రెండు పాత్రల్లో విజయ్ కనిపించాడు. విజయ్ యాక్టింగ్, లోకేష్ కనకరాజ్ స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
పార్తిబన్ (దళపతి విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లో కేఫ్ నడుపుతూ రహస్య జీవితం గడుపుతంటాడు. అతడిని చంపడానికి ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ ట్రై చేస్తుంది. ఆంటోనీ దాస్ ఎవరు? ఆంటోనీ దాస్ కొడుకు లియో, పార్తిబన్ ఒకే పోలికలతో ఉండటానికి కారణం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.