Thalapathy Vijay 69 Movie Jana Nayagan Title Revealed: ఇళయ దళపతి విజయ్ 69 మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదే విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కానుందని ఇదివకు దళపతి ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టనున్న నేపథ్యంలో విజయ్ చివరి సినిమా బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ 69 మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. విజయ్ ఆఖరి సినిమా టైటిల్‌ను జన నాయగన్‌గా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన జన నాయగన్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ (జనవరి 26) విడుదల చేశారు.
జన నాయగన్ సినిమాలోని విజయ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో హీరో విజయ్ నీలిరంగు డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, బూట్లు ధరించాడు. అలాగే డార్క్ సన్ గ్లాసెస్ ధరించిన విజయ్ నవ్వుతూ జనంతో నిండిపోయిన సమూహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఒక వాహనంపై నిలబడి ప్రజలతో సెల్ఫీ తీసుకుంటూ నిజమైన జన నాయగన్ అనిపించుకునేలా ఆ పోస్టర్‌ను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది.
నాయగన్ అంటే నాయకుడు అని అర్థం. అంటే, జన నాయకుడు అని విజయ్ కొత్త సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమాను పొలిటికల్ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు టైటిల్ చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా, జన నాయగన్ సినిమా బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అనే మరో టాక్ జోరుగా నడుస్తోంది.
భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్‌లో తమిళ యాక్టర్ వీటీ గణేష్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు ఊపునిచ్చాయి. ఆ ఈవెంట్‌లో భగవంత్ కేసరి రీమేక్‌ను డైరెక్ట్ చేయమని అనిల్ రావిపూడిని హీరో విజయ్ అడిగినట్లు, అందుకు కుదరదని అనిల్ చెప్పినట్లుగా వీటీ గణేష్ మాట్లాడారు.
కానీ, వీటీ గణేష్ ఏది క్లియర్‌గా చెప్పనివ్వకుండా అనిల్ రావిపూడి అడ్డు పడ్డారు. అలాంటివి చెప్పకూడదంటూ ఏదో గణేష్ చెవిలో చెప్పి అక్కడితో టాపిక్ క్లోజ్ చేయించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాబట్టి, అనిల్‌తో కుదరని భగవంత్ కేసరి సినిమాను తమిళ పాపులర్ డైరెక్టర్ హెచ్ వినోద్‌తో విజయ్ రీమేక్ చేయిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా పలు కథనాలు రాసింది.
అయితే, ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో లేదా, జన నాయగన్ మూవీ రిలీజ్ అనంతరం క్లారిటీ వచ్చేయనుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్