తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న ‘జన నాయకుడు’ చిత్రాన్ని హిస్టారికల్ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు. అందుకు కారణం ఆయన నటిస్తోన్న చివరి చిత్రమిది. అయితే, దళపతి విజయ్ బర్త్ డే (జూన్ 22) సందర్భంగా మేకర్స్ జన నాయకుడు ఫస్ట్ రోర్ గ్లింప్స్‌ను ఇవాళ విడుదల చేశారు.
ఇప్పుడీ జన నాయకుడు గ్లింప్స్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ్ చివరి చిత్రం కావటంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పలకటానికి బీజం చేసినట్లు గ్లింప్స్ రెడీ చేసినట్లు అర్థమవుతుంది.
ఇక 65 సెకన్ల వ్యవధి ఉన్న ‘జన నాయకుడు’ ఫస్ట్ రోర్ వీడియోను గమనిస్తే.. ‘నా హృదయంలో ఉండే..’ అనే మాటలు విజయ్ వాయిస్‌లో మనకు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తుంటారు. ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి.
శక్తి, శాంతి, గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే జన నాయగన్ మూవీ దళపతి విజయ్‌కి సాధారణ వీడ్కోలుగా లేదని స్పష్టంగా తెలుస్తోంది. జన నాయకుడు ఫస్ట్ రోర్ వీడియోతో పాటు విడుదలైన బర్త్ డే పోస్టర్ మరింతగా మెప్పిస్తోంది.
పెద్ద సింహాససనం మీద దళపతి విజయ్ ఠీవిగా కూర్చుని చేతిలో కత్తిని పట్టుకున్నాడు. ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజయ్ చుట్టూ పొగ ఆవరించబడి ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయకుడు కలిసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన కథానాయకుడని అర్థం చేసుకోవచ్చు.
జన నాయకుడు మూవీని కేవలం సినిమా మాత్రమే కాదు, స్టార్‌డమ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో సినీ కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్యక్తి ఉద్యమంగా మారాడో తెలియజేసే గొప్ప నివాళి. భావోద్వేగమైన కథలను చెప్పటంలో దిట్ట అయిన హెచ్.వినోద్ జన నాయగన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే, జన నాయకుడు సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్, అనిరుద్ కాంబోలో ఇది వరకే ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబో ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతినివ్వనుంది.
కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ రూపొందిస్తోన్న జన నాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9, 2026న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా విజయ్‌కి గొప్ప సెండాఫ్‌గా నిలవనుంది. మూడు దశాబ్దాల గొప్ప వారసత్వానికి ఇది గొప్ప వేడుకగా నిలవనుంది.
సంబంధిత కథనం