Thalapathy Vijay: అల్లు అర్జున్ పాటకు డ్యాన్స్ చేసిన దళపతి విజయ్.. వీడియో వైరల్-thalapathy vijay dances to allu arjun butta bomma song pooja hegde posts the video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Thalapathy Vijay Dances To Allu Arjun Butta Bomma Song Pooja Hegde Posts The Video

Thalapathy Vijay: అల్లు అర్జున్ పాటకు డ్యాన్స్ చేసిన దళపతి విజయ్.. వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 23, 2023 05:38 PM IST

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేశాడు. ఈ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.

డ్యాన్స్ చేస్తున్న విజయ్, పూజా హెగ్డే
డ్యాన్స్ చేస్తున్న విజయ్, పూజా హెగ్డే

Thalapathy Vijay: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు చాలా పాపులర్ అయ్యాయి. పూజా హెగ్డే కూడా ఆకట్టుకుంది. చాలా మంది సెలెబ్రిటీలతో పాటు కొందరు క్రికెటర్లు కూడా బుట్టబొమ్మ స్టెప్ ట్రై చేశారు. మొత్తంగా ఈ పాటలో బన్నీ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. కాగా, తమిళ స్టార్ దళపతి విజయ్ కూడా ఓ సందర్భంలో బుట్ట బొమ్మ పాటకు స్టెప్ వేశాడు. ఈ వీడియోను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నేడు (జూన్ 23) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

దళపతి విజయ్ గురువారం (జూన్ 22) తన 49వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. అయితే, పూజా హెగ్డే కాస్త ఆలస్యంగా నేడు (జూన్ 23) విజయ్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. గతంలో విజయ్‍తో కలిసి బీస్ట్ మూవీలో నటించింది పూజా. బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో విజయ్‍తో కలిసి బుట్ట బొమ్మ పాటకు సరదాగా స్టెప్పులు వేసింది పూజా. బుట్ట బొమ్మ సిగ్నేచర్ స్టెప్ వేశారు విజయ్, పూజా. ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేసింది పూజా హెగ్డే. “బీస్ట్ సెట్‍లో తీసుకున్న ఓ జెమ్ నా ఫోన్‍లో ఉంది. నిన్న దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా..” అని క్యాప్షన్ పెట్టింది పూజా హెగ్డే.

విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ రోజు ఆలస్యంగా ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది పూజా. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‍గా మారింది. ఇన్‍స్టాగ్రామ్‍లో ఇప్పటికే 7లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి.

దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లియో మూవీ నుంచి గురువారం (జూన్ 22) నా రెడీ అనే తొలి పాట విడుదలైంది. ఈ పాటలో మాస్ స్టెప్‍లతో అదరగొట్టాడు విజయ్. అదిపోయే బీట్‍తో ఈ పాట ఉంది. లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. అలాగే, లియో ఫస్ట్ లుక్‍ కూడా గురువారమే రిలీజ్ అయింది. మొత్తంగా విజయ్ అభిమానులకు ఒకే రోజు రెండు బొనాంజాలు వచ్చాయి. లియో మూవీని అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.