Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-thalapathy vijay comedy drama movie nanaban movie now streaming on amazon prime video after jiohostar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Thalapathy Vijay - Nanban OTT: నన్‍బన్ సినిమా మరో ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలివే..

Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘నన్‍బన్’ సినిమా 2012 జనవరిలో విడుదలైంది. జీవా, శ్రీకాంత్, ఇలియానా కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. బాలీవుడ్ మూవీ ‘3 ఇడియట్స్’కు రీమేక్‍గా ఇది రూపొందింది. ఈ నన్‍బన్ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. అయితే, ఈ రీమేక్‍ మూవీ అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేదు. కాగా, ఈ చిత్రం ఇన్నేళ్లకు ఇప్పుడు రెండో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

నన్‍బన్ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ చాలా ఏళ్ల క్రితమే జియోహాట్‍స్టార్ (డిస్నీ+ హాట్‍స్టార్) ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఇలా మరో ప్లాట్‍ఫామ్‍లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

ఇంజినీరింగ్ కాలేజీ.. ముగ్గురు స్నేహితులు

నన్‍బన్ సినిమా ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ముగ్గురు స్నేహితుల మధ్య సాగుతుంది. ఆ ముగ్గురు చేసే పనులు, స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. చాలా మంది స్నేహితులకు, కాలేజీ విద్యార్థులకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ మూవీ ఉంటుంది. ఎమోషనల్ సీన్లు కూడా ఉంటాయి. హిందీ వెర్షన్ ‘3 ఇడియట్స్’ కథకు పెద్దగా మార్పులు చేయకుండానే తమిళంలో నన్బన్ తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో పర్ఫార్మ్ చేయలేకపోయింది. తెలుగులోనూ స్నేహితుడు పేరుతో ఈ మూవీ విడుదలైంది.

నన్‍బన్ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా ఇలియానా నటించారు. శ్రీకాంత్, జీవా ఫ్రెండ్స్ పాత్రల్లో చేశారు. సత్యరాజ్, సత్యన్, అనుయా, టీఎం కార్తీక్, మనోబాలా, ఆడుకాలం నరేన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై మనోహర్ ప్రసాద్, రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

హీరో ఎంపికలో ట్విస్టులు!

నన్‍బన్ సినిమాను 2010లో ముందుగా దళపతి విజయ్ ఓకే చేశారు. కానీ డేట్లు కుదరదనే ఉద్దేశంతో ఆ తర్వాత ఈ మూవీ వద్దనుకున్నారు. దీంతో సూర్యను హీరోగా తీసుకోవాలని మేకర్స్ చర్చలు జరిపారు. కానీ అది జరగలేదు. దీంతో మళ్లీ విజయ్‍నే నిర్మాతలు సంప్రదించగా.. అప్పుడు ఆయన ఓకే చేశారు. ఇలా ముందు వద్దనుకున్న ప్రాజెక్ట్.. మళ్లీ విజయ్ దగ్గరికే వచ్చింది. ఈ మూవీలో తన నటనతో విజయ్ మెప్పించారు.

ప్రస్తుతం ఇలా..

దళపతి విజయ్ ప్రస్తుతం జయనాయగన్ సినిమా చేస్తున్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఇదే తన చివరి మూవీ అని ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. పొలిటికల్ యాక్షన్ జానర్లో ఈ మూవీ ఉండనుంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా చేస్తున్నారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, మమితా బైజూ కీరోల్స్ చేస్తున్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం