Thalapathy 67 OTT Rights: ఓపెనింగ్ ఈవెంట్‌తోనే 120 కోట్లకు అమ్ముడుపోయిన విజయ్ 67 మూవీ డిజిటల్ రైట్స్
Thalapathy 67 OTT Rights: విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ఓటీటీ హక్కులు సినిమా ఓపెనింగ్ రోజే భారీ ధరకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయంటే....
Thalapathy 67 OTT Rights: మాస్టర్ తర్వాత దళపతి విజయ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. విక్రమ్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవలే నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఓపెనింగ్‌తోనే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. విజయ్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. భారీ పోటీ మధ్య దాదాపు 120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ విజయ్- లొకేష్ కనకరాజ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఆడియో రైట్స్‌ను సోని సంస్థ 16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. ఓపెనింగ్ ఈవెంట్‌తోనే ఈ సినిమా 216 కోట్ల బిజినెస్ చేయడం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో విజయ్‌తో త్రిష జోడీకట్టనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఐదో సినిమా ఇదే కావడం గమనార్హం. గతంలో గిల్లీ, కురివితో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో విజయ్, త్రిష జంటగా నటించారు.
విజయ్ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌తో పాటు ప్రియా ఆనంద్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. విజయ్ హీరోగా నటిస్తోన్న 67వ సినిమా ఇది.