Thala Movie Review: తల రివ్యూ - టాలీవుడ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Thala Movie Review: రణం ఫేమ్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ తల. యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన మూవీ తల. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. రోహిత్, ఎస్తేర్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
తండ్రి కోసం అన్వేషణ...
రాంబాబుకు (రాగిన్ రాజ్) తల్లి అంటే ప్రాణం. అమ్మ కోసం ఎంత దూరం వెళ్లడానికైనా, ఎవరినైనా ఎదురించడానికైనా సిద్ధపడతాడు. రాంబాబు తండ్రి (రోహిత్)... లక్ష్మి అనే మరో మహిళ్లను పెళ్లిచేసుకుంటాడు. తల్లి కోరిక మేరకు తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు రాంబాబు. తానేవరో చెప్పకుండా తండ్రికి దగ్గరవుతాడు.
తన తండ్రి పెద్ద సమస్యలతో చిక్కుకున్నాడనే నిజం బయటపడుతుంది? అదేమిటి? రాంబాబు తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? తండ్రిని తీసుకొస్తానని తల్లికి ఇచ్చిన మాటను రాంబాబు ఎలా నిలబెట్టుకున్నాడు? ఈశ్వరి (ఇంద్రజ), బబ్లూ (సత్యం రాజేష్)...రాంబాబు జీవితంలోకి ఎలా వచ్చారు? తాను ప్రేమించిన అమ్మాయికి రాంబాబు ఎందుకు దూరం కావాల్సివచ్చింది? అన్నదే తల మూవీ కథ.
మదర్ సెంటిమెంట్...
మదర్ సెంటిమెంట్‌కు యాక్షన్ అంశాలను జోడించి తల మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్. తల్లికి ఇచ్చిన మాట కోసం ఓ యువకుడు ఏం చేశాడు? తన కుటుంబం కోసం రౌడీ గ్యాంగ్‌తో ఎందుకు పోరాడాల్సివచ్చిందన్నది ఈ మూవీలో చూపించాడు.
ఉత్తర ప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో...
వయోలెన్స్ డోసు ఎంత ఎక్కువ ఉంటే సినిమా అంత హిట్టు అని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. సినిమాలో ఉన్నది మూడే యాక్షన్ సీక్వెన్స్‌లు అయినా మితిమీరిన హింసతో చూపించాడు. సినిమా నేపథ్యం మొత్తం ఉత్తర ప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లోనే డైరెక్టర్ నడిపించాడు. ఆ నేటివిటీకి తగ్గట్లుగా క్యారెక్టర్స్ లుక్‌ను డిజైన్ చేసుకున్నాడు.సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు సమాంతరంగా ఓ ప్రేమకథను నడిపించాడు.
యాక్షన్ మోడ్...
రాగిన్‌రాజ్‌కు అతడి తల్లితో ఉన్న అనుబంధంతోనే తల మూవీ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ ఎస్లాబ్లిష్ చేయడానికే ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. లవ్‌స్టోరీ టైమ్‌పాస్ చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ కంప్లీట్‌గా యాక్షన్ మోడ్‌లో నడిపించాడు.
మల్టీపుల్ లేయర్స్...
సినిమాలో మల్టీపుల్ లేయర్స్‌ను టచ్ చేశాడు. కానీ దేనిని డెప్త్‌గా చూపించలేకపోయాడు. తండ్రి కోసం రాగిన్ చేసే పోరాటంలో అనుకున్నంతగా ఎమోషన్ పండలేదు. అమ్మ రాజశేఖర్ సినిమాల్లో ఉండే కామెడీ ఇందులో మిస్సయ్యింది.
సిక్స్ టీన్స్ ఫేమ్...
రాగిన్ రాజ్‌కు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఓకే అనిపించాడు. కానీ ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త పరిణితి చూపిస్తే బాగుండేది. హీరో తండ్రిగా సిక్స్ టీన్స్ ఫేమ్ రోహిత్ కనిపించాడు. అతడి క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంది. ఎస్తేర్ నోరాన్హా, అజయ్, సత్యం రాజేష్ తమ ఎక్స్‌పీరియన్స్‌తో పాత్రలకు తగ్గట్లుగా నటించారు. నెగెటివ్ రోల్‌లో రాధారాజశేఖర్ కనిపించింది. ధర్మతేజ బీజీఎమ్ బాగుంది. ఈ సినిమాలో తమన్ రెండు పాటలు పాడాడు. వినడానికి బాగున్నాయి.
ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే...
తల యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తుంది. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం