OTT: ఓటీటీలో రెంట్ లేకుండా అందుబాటులోకి వచ్చిన సూపర్ హిట్ లవ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..
Teri Baaton Mein Aisa Uljha Jiya OTT: తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా సినిమా ఓటీటీలోకి వచ్చింది. షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్ మొదలైంది. ఆ వివరాలు ఇవే..
Teri Baaton Mein Aisa Uljha (TBMAUJ) Jiya OTT: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన ‘తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ రివ్యూలే వచ్చినా.. వసూళ్లను మాత్రం ఈ చిత్రం బాగానే రాబట్టింది. ఈ మూవీకి అమిత్ జోషి, ఆరాధనా షా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. రెంట్ లేకుండా..
తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. హిందీ ఆడియోలో మాత్రమే ప్రస్తుతం ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ వెర్షన్లను తీసుకొచ్చేది లేనిది ప్రైమ్ వీడియో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుమైతే హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు ఉంది.
కొన్ని రోజుల కిందటే ఈ చిత్రం రెంటల్ పద్ధతిలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ లేకుండా అందుబాటులోకి వచ్చింది. అంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఇప్పుడు ఎలాంటి రెంట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు.
థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాత తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా మూవీ రెంట్ లేకుండా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సైన్స్ ఫిక్షన్, లవ్ కామెడీ మూవీగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కలెక్షన్లు
తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా చిత్రానికి సుమారు రూ.133కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కెరీర్లో ఇది రెండో అతిపెద్ద హిట్‍గా నిలిచింది. మిశ్రమ స్పందనలు వచ్చినా.. వసూళ్ల పరంగా ఈ చిత్రం సత్తాచాటింది. అలాగే, వరుస ప్లాఫ్‍ల్లో ఉన్న కృతిసనన్‍కు కూడా ఈ చిత్రం ఊరటనిచ్చింది.
ఈ చిత్రంలో ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, రాకేశ్ బేడీ, అనుభా ఫతేపూరియా, రాజేశ్ కుమార్, రాశూల్ టాండన్, బ్రిజ్‍భూషణ్ శుక్లా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అమిత్ జోషి, ఆరాధన షా డైరెక్టర్ చేయగా.. సుమారు ఏడుగురు సంగీతం అందించారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే, లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీని నిర్మించారు.
స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే
ఊర్మిళ (దింపుల్ కపాడియా) వద్ద ఆర్యన్ అగ్రిహోత్రి (షాహిత్ కపూర్) రొబోటిక్స్ ఇంజినీర్‌గా పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ ముఖ్యమైన ప్రాజెక్టు కోసం ఉర్మిళతో ఆర్యన్ అమెరికాకు వెళతాడు. ఊర్మిళ వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆర్యన్‍తో పని చేసేందుకు సిఫ్రా (కృతి సనన్)ను నియమిస్తారు. ఈ క్రమంలో ఆర్యన్, సిఫ్రా ప్రేమించుకుంటారు. అయితే, సిఫ్రా మనిషి కాదని, హ్యుమనాయిడ్ రోబో అని ఆర్యన్‍కు తెలుస్తుంది. ఆ తర్వాత ఆర్యన్ ఏం చేశాడు? అనేదే తేరీ బాతో మే ఏసా ఉల్జా జియా సినిమా స్టోరీగా ఉంది.