OTT Telugu Web Series: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్.. పది రోజుల్లోనే ఆ రికార్డు
OTT Telugu Web Series: ఓటీటీలో ఇప్పుడో తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. ఓటీటీలోకి వచ్చిన పది రోజుల్లోనే ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఆహా వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Telugu Web Series: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఆహా వీడియో ఓటీటీ ఈ నెల మొదట్లో తీసుకొచ్చిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ (Home Town). ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. పది రోజుల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకోవడం విశేషం.
హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రికార్డు
ఆహా వీడియో ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ హోమ్ టౌన్. శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీలాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ పది రోజుల్లోనే ఈ ఓటీటీలో 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం.
ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఎంచుకున్న మార్గం కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్యే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ సెంచరీ కొట్టిన తర్వాత తన జేబులోని ఓ పేపర్ ను చూపించిన విషయం తెలిసిందే. దానిపై ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అనే అక్షరాలను చూడొచ్చు.
ఆ అక్షరాల స్థానంలో ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీ.. 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ అనే అక్షరాలను ఉంచింది. ప్రేక్షకులను మరోసారి ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్లిన ఈ సిరీస్ కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. దీంతో ఈ సిరీస్ ను చూస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఈటీవీ విన్ ఓటీటీ బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ #90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి వచ్చిన హోమ్ టౌన్‌ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. రాజీవ్ కనకాల, ఝాన్సీతోపాటు ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి, అభయ్ నవీన్ తదితరులు నటించారు. ఏప్రిల్ 4 నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
తన కొడుకును విదేశాలకు పంపించాలని కలలు కనే ఓ తండ్రి, అది ఇష్టం లేని ఆ కొడుకు చుట్టూ తిరిగే కథే ఈ హోమ్ టౌన్. ప్రేక్షకులను 2000 దశాబ్దానికి తిరిగి తీసుకెళ్లిన సిరీస్ ఇది. దీంతో చాలా మంది ఈ సిరీస్ కు కనెక్ట్ అవతున్నారు.
మన స్నేహితులతో, తల్లిదండ్రులతో, ఇంట్లో చేసిన పనులనే హౌమ్ టౌన్‌లో చూపించారు. ఒక్కో స్టోరీని ఒక్కో ఎపిసోడ్‌గా తెరకెక్కించారు. వాటికి ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, లవ్ ట్రాక్ వంటివి జోడించారు. హౌమ్ టౌన్ మొత్తం 5 ఎపిసోడ్స్‌తో సుమారుగా 30 నిమిషాల రన్ టైమ్‌తో సాగుతుంది.
ఇందులో నటించిన వాళ్ల నటన కూడా చాలా బాగుందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్ కనకాల, ఝాన్సీ తమ పాత్రల్లో జీవించేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మధ్య తరగతి జీవితాలను తెరకెక్కించే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఎంతటి ఆదరణ ఉంటుందో ఈ హోమ్ టౌన్ మరోసారి చూపించింది. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
సంబంధిత కథనం