Agnisakshi web series review: అగ్నిసాక్షి వెబ్ సిరీస్ ..గౌరీని చంపాలనుకున్న మాస్క్ మ్యాన్.. శంకర్ వదిన చేసిన తప్పు ఏంటి?
Agni sakshi web series review: అగ్నిసాక్షి వెబ్ సిరీస్ ఫస్ట్ వీక్ రివ్యూ.. గౌరీ, శంకర్ జంట మరోసారి అగ్నిసాక్షి పేరుతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ నటించిన అగ్ని సాక్షి వెబ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది.
Agni sakshi web series review: గౌరీ శంకర్ జంట అంటే అందరికీ ఫేవరెట్. ఒకప్పుడు స్టార్ మాలో అగ్ని సాక్షి సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అందరినీ టీవీలకు కట్టి పడేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే పేర్లు, అదే జంటతో సరికొత్త అగ్నిసాక్షి మొదలైంది. అయితే అది టీవీ సీరియల్ కానీ ఇప్పుడు అగ్నిసాక్షి మాత్రం ఒక క్రైమ్ వెబ్ సిరీస్.

జులై 12వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. ప్రతి శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి. ఇక ఈరోజు ఈ సిరీస్ కి సంబంధించి నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అంబటి అర్జున్, ఐశ్వర్య పిస్సే జంటగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్లిపోదాం వచ్చేయండి.
అగ్నిసాక్షి వెబ్ సిరీస్ రివ్యూ..
ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ లోనే విలన్ ఎంట్రీ ఇస్తాడు. మొహానికి మాస్క్ పెట్టుకుని పెళ్లి చేసుకోబోతున్న ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆమెను చంపిన తర్వాత తన జుట్టు కొద్దిగా కత్తిరించుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అతడు చంపాలనుకున్న తన నెక్స్ట్ టార్గెట్ గౌరీ.
ఏసీపీ ఉమా శంకర్ నిజాయితీ కలిగిన ఒక పోలీసాఫీసర్. రాఖీ భాయ్ గ్యాంగ్ లో చేరి అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ గ్యాంగ్ కి చెందిన ఖలీద్ ద్వారా గ్యాంగ్ లో చేరాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తాడు. పోలీసుల నుంచి అతడిని తప్పించి వాడితో కలిసి రాఖీ భాయ్ గ్యాంగ్ లో చేరాలని అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ స్ట్రింగ్ ఆపరేషన్ లో గౌరీ వేలు పెట్టేసి మొత్తం చెడగొట్టేస్తుంది.
ఇద్దరి బాధ ఒక్కటే
గౌరీ అందమైన అమ్మాయి. పోలీస్ అవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంది. అందుకోసం పరీక్ష రాస్తుంది కానీ ఫెయిల్ అవుతుంది. తన తండ్రి ఒక పోలీసాఫీసర్ కానీ కొన్ని కారణాల వల్ల తనను తాను గన్ తో కాల్చుకుని చనిపోతాడు. అది తనను ఎంతో బాధిస్తుంది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో పిన్నీ, బాబాయ్ దగ్గర పెరుగుతుంది.
శంకర్, గౌరీల కుటుంబ నేపథ్యం వేరు వేరు అయినప్పటికీ వారికి ఉన్న బాధ మాత్రం ఒకటే. అదే తనకు ఇష్టమైన వారిని పోగొట్టుకోవడం. శంకర్ కి తన అన్న విశ్వ అంటే చాలా ఇష్టం. కానీ వదిన చేసిన మోసం కారణంగా ఆ కుటుంబం చిన్నాభిన్నామవుతుంది. శంకర్ అన్నావదిన కూడా పోలీస్ ఆఫీసర్స్. కానీ ఆమె చేసిన ఒక పని వల్ల అవమాన భారంతో విశ్వ భార్యను షూట్ చేసి తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు.
టార్గెట్ గౌరీ
వదిన చేసిన పనికి ఎప్పటికీ తనను క్షమించలేనని అనుకుంటాడు. ఒకరోజు గౌరీ రోడ్డు మీద వెళ్తుండగా మాస్క్ మ్యాన్ ఆమెను కారుతో ఢీ కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. సరిగా అదే టైమ్ కి శంకర్ వస్తే అతడిని కొట్టేందుకు చూస్తుంది. అలా వారి ఇద్దరి మధ్య రెండో సారి గొడవ జరుగుతుంది.
ఈ సిరీస్ మధ్య మధ్యలో గౌరీ, శంకర్ ఫ్యామిలీస్ ని పరిచయం చేశారు. గౌరీ తన పిన్ని, బాబాయ్ దగ్గర ఉంటుంది. శంకర్ నానమ్మ గాయత్రీ దేవి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు గడప దాటి బయటకు వెళ్లకూడదని చెప్తుంది. ఆడవాళ్ళు భుజం మీద చీర కొంగు వేసుకుని తిరగాలని అంటుంది. శంకర్ కి చెల్లి సత్య, తమ్ముడు విజయ్ ఉన్నారు.
కోడలు ఇంటి గడప దాటకూడదు
సత్యకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వదిన చేసిన పని కారణంగా ఆ ఇంటి మీద మచ్చ పడుతుంది. ఆమె వల్ల సత్యకు మంచి సంబంధాలు రావని తనకు అసలు పెళ్లి కావడమే కష్టమని పెళ్ళిళ్ళ బ్రోకర్ శకుంతల అంటుంది. శంకర్ తన అన్న విశ్వను తలుచుకుని బాధపడుతుంటే గాయత్రీ దేవి ఓదారుస్తుంది.
తన ఇంటికి రాబోయే కోడలు ఏ మచ్చ లేనిది అయి ఉండాలని. ఇంటి గడప దాటకూడదని చెప్తుంది. అలాంటి అమ్మాయిని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అంటుంది. ఇక మాస్క్ మ్యాన్ గౌరీ గదిలోకి వచ్చి ఆమెకు తెలియకుండా తన జుట్టు కొద్దిగా కట్ చేసుకుంటాడు. తనను చంపేందుకు ప్రయత్నిస్తాడు.
మాస్క్ మ్యాన్ దగ్గర ప్రీతి
పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాననే ఉద్దేశంతో గౌరీ చేసే ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. కానీ పరీక్ష ఫెయిల్ కావడంతో ఆమె మళ్ళీ ఉద్యోగంలో చేరేందుకు వెళ్తుంది. అక్కడ వచ్చిన ఒక చిన్న సమస్యను పరిష్కరించేస్తుంది. మళ్ళీ ఉద్యోగం కావాలని అడిగితే ప్రీతి అనే అమ్మాయి మానేసింది తన బదులు చేయమని చెప్తాడు. కట్ చేస్తే ప్రీతి మాస్క్ మ్యాన్ ఇంట్లో ఉంటుంది. అసలు ప్రీతి ఎవరు? మాస్క్ మ్యాన్ కి తనకు సంబంధం ఏంటి? గౌరీని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ చూడాల్సిందే.
తరువాయి భాగంలో..
గౌరీ ప్రతీ స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండగా మాస్క్ మ్యాన్ తనను చంపేందుకు వెంట పడతాడు. అటు శంకర్ ఏదో మిషన్ చేపట్టేందుకు రెడీ అయిపోతాడు. మాస్క్ మ్యాన్ అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? వారి తల వెంట్రుకలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? గౌరీని ఎందుకు టార్గెట్ చేశాడో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.
టాపిక్