Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?-telugu tv star maa zee telugu etv gemini serials trp ratings january second week karthika deepam 2 brahmamudi chinni trp ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Serials Trp Ratings: స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?

Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 23, 2025 04:47 PM IST

Telugu TV Serials TRP Ratings January 2nd Week: తెలుగు టీవీ సీరియల్స్‌కు సంబంధించిన జనవరి రెండో వారం టీఆర్‌పీ రేటింగ్స్ జాబితా వచ్చేసింది. ఎప్పటిలాగే స్టార్ మా ఛానెల్స్ మొదటి స్థానంలో దూసుకుపోతుంటే రెండో ప్లేసులో జీ తెలుగు నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సీరియల్స్‌పై లుక్కేద్దాం.

స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?
స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?

TRP Ratings Of Telugu Serials This Week: తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌కు వినోదం పంచుతున్న బుల్లితెర ఛానెల్స్ స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, జెమినీ టీవీ. ఈ ఛానెల్స్‌లోని సీరియల్స్‌ సక్సెస్ రేట్‌ను టీఆర్‌పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్ లేదా టార్గెట్ రేటింగ్ పాయింట్)తో అంచనా వేస్తారు. మరి జనవరి రెండో వారంలో ఏ ఛానెల్ సీరియల్స్ టాప్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ

ఎప్పటిలాగే టాప్ 1 స్టార్ మా సీరియల్స్ దూసుకుపోతున్నాయి. వీటిలో కార్తీక దీపం 2 12.9 రేటింగ్‌తో టాప్1లో ఉంటే, ఇల్లు ఇల్లాలు పిల్లలు 12.20 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అలాగే, టాప్ 3లో ఇంటింటి రామాయణం 10.44 పాయింట్స్, 10.44 టీఆర్‌పీతో చిన్ని నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో 10.16 పాయింట్లతో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నిలిచింది.

బ్రహ్మముడికి 5.34 రేటింగ్

అయితే, గత వారంతో పోలిస్తే ఈ వారం స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గుండె నిండా గుడి గంటలు తర్వాతి స్థానంలో టాప్ 6లో ఉన్న నువ్వుంటే నా జతగా 6.83 పాయింట్లతో నిలిచింది. అంటే, ఒక్కో సీరియల్ టీఆర్‌పీలో ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్ మా టాప్ సీరియల్స్‌లో ఒకటైన బ్రహ్మముడి 5.34 టీఆర్‌పీతో సరిపెట్టుకుంది. అలాగే, ఈ ఛానెల్‌లో అతి తక్కువ టీఆర్‌పీ నమోదు చేసుకున్న సీరియల్‌గా రేణుక ఎల్లమ్మ (0.72) నిలిచింది.

జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్

జీ తెలుగులోని మేఘ సందేశం 7.52, పడమటి సంధ్యారాగం 7.04, చామంతి 6.85, నిండు నూరేళ్ల సావాసం 6.82, జగద్ధాత్రి 6.54 టీఆర్‌పీతో వరుసగా టాప్ 5 సీరియల్స్‌గా నిలిచాయి. ఇలా స్టార్ మా తర్వాత జీ తెలుగు రెండో స్థానంలో నిలిచింది. ఇక దీంట్లో అతి తక్కువ 1.30 టీఆర్‌పీతో సీతారామ ఉంది. అయితే, ఇది స్టార్ మా రేణుక ఎల్లమ్మ సీరియల్ టీఆర్‌పీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

మూడో స్థానంలో ఈటీవీ

ఇక మూడో స్థానంలో ఈటీవీ సీరియల్స్ నిలిచాయి. ఈటీవీ ఛానెల్‌లో టాప్ 5 సీరియల్స్‌గా వరుసగా 3.51 టీఆర్‌పీతో రంగులరాట్నం, 3.49తో మనసంతా నువ్వే, 2.77తో బొమ్మరిల్లు, 2.61తో రావోయి చందమామ, 2.00తో శతమానంభవతి జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈటీవీలో అన్నిటికంటే తక్కువగా కావ్య, నేను శైలజ సీరియల్స్ 0.43 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి.

జెమినీ టీవీ సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్

జనవరి 2వ వారం జెమినీ టీవీ సీరియల్ల్ టీఆర్‌పీ మరి దారుణంగా తగ్గిపోయింది. జెమినీ టీవీలోని శ్రీమద్ రామాయణం సీరియల్ 0.93 టీఆర్‌పీ రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉంది. తర్వాత టాప్2లో 0.76తో కొత్తగా రెక్కలొచ్చెనా, టాప్ 3లో 0.70తో భైరవి, టాప్ 4లో 0.59తో నువ్వే కావాలి, ఐదో స్థానంలో 0.53తో సివంగి సీరియల్స్ ఉన్నాయి. ఇక ఇందులో అతి తక్కువగా 0.17 టీఆర్‌పీ రేటింగ్‌తో రాధ సీరియల్ నిలిచింది.

Whats_app_banner

సంబంధిత కథనం