Telugu TV Shows TRP Ratings: మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే-telugu tv shows trp ratings sudigali sudheer family stars back in race ishmart jodi on top ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Tv Shows Trp Ratings: మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Telugu TV Shows TRP Ratings: మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu
Jan 24, 2025 06:49 PM IST

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ షో మరోసారి రేసులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ షో మూడో స్థానంలో ఉంది.

మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలలో వచ్చే షోలకు సంబంధించిన లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. ఈ ఏడాది రెండో వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇవి. ఇందులోనూ స్టార్ మా, ఈటీవీలలో వచ్చే షోల హవా కొనసాగింది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ షో మరోసారి మూడోస్థానంలోకి వచ్చింది. టాప్ 10లో మొత్తంగా ఈటీవీలో వచ్చే ఏడు షోలు ఉండటం విశేషం.

ఇస్మార్ట్ జోడీ టాప్

తెలుగు టీవీ షోలలో స్టార్ మా ఛానెల్ చెందిన షోలే టాప్ 2లో ఉన్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు స్థానంలో కొత్తగా మొదలైన ఇస్మార్ట్ జోడీ షో టీఆర్పీల్లో టాప్ లో కొనసాగుతోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షో వచ్చీ రాగానే టీఆర్పీల్లో టాప్ లోకి దూసుకెళ్లగా.. తాజా రేటింగ్స్ లోనూ హవా కొనసాగించింది.

ఇస్మార్ట్ జోడీ షో అర్బన్, రూరల్ కలిపి 4.88 రేటింగ్ తో తొలి స్థానంలో ఉంది. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే 5.26గా ఉంది. ఈ షో తర్వాత స్టార్ మాలోనే శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో 3.97 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది.

ఈటీవీ షోల హవా

తొలి రెండు స్థానాల్లో స్టార్ మా షోలు ఉండగా.. తర్వాత మొత్తం ఈటీవీ షోల హవా నడిచింది. మూడో స్థానంలో ఈ ఛానెల్లో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ నిలిచింది. ఈ షో తాజాగా 3.94 రేటింగ్ సాధించింది. ఇక ఈటీవీలోనే వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.26 రేటింగ్ తో నాలుగో స్థానంలో ఉండగా.. జబర్దస్త్ కామెడీ షో 2.75 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉంది.

ఆరో స్థానంలోనూ ఈటీవీ డ్యాన్స్ షో ఢీ 2.36 రేటింగ్ తో ఉంది. ఏడో స్థానంలో జీ తెలుగు ఛానెల్లో వచ్చే సరిగమప సింగింగ్ షో 2.26 రేటింగ్ తో నిలిచింది. ఆ తర్వాత వరుసగా సుమ అడ్డా (1.81), పాడుతా తీయగా (1.60) ఉన్నాయి. టీవీ సీరియల్స్ విషయంలో పూర్తిగా వెనుకబడిపోయిన ఈటీవీ.. టీవీ షోలలో మాత్రం స్టార్ మాకు గట్టి పోటీ ఇస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం