Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. భారీగా పెరిగిన కార్తీకదీపం.. టాప్ 3లో ఇవే
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 52వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో టాప్ సీరియల్ కార్తీకదీపం రేటింగ్ భారీగా పెరిగింది. తన తొలి స్థానాన్ని ఆ సీరియల్ మరింత పదిలపరచుకుంది.
Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ తాజా టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. వీటిలో స్టార్ మాకు చెందిన సీరియల్సే టాప్ 6లో నిలవడం విశేషం. అయితే చాలా రోజులుగా తొలి స్థానంలో ఉంటున్న కార్తీకదీపం.. తాజా టీఆర్పీల్లో మరింత మెరుగైన రేటింగ్ సాధించడం విశేషం. రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కంటే చాలా మెరుగ్గా ఉంది. కిందటి వారం ఈ దూరం తగ్గినా.. తాజా రేటింగ్స్ లో మళ్లీ పెరిగింది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా సీరియల్స్ కు టీఆర్పీ రేటింగ్స్ లో తిరుగులేకుండా పోతోంది. 2024 మొత్తం టాప్ 10 సీరియల్స్ లో ఆ ఛానెల్ సీరియల్సే టాప్ లో ఉంటూ వచ్చాయి. ఇక చివరిదైన 52వ వారం కూడా టాప్ 6లో స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. అంతేకాదు ఇవన్నీ కూడా 10కిపైగా రేటింగ్స్ సాధించడం విశేషం. బ్రహ్మముడి తర్వాత తొలి స్థానంలో ఉంటూ వస్తున్న కార్తీకదీపం సీరియల్ తాజాగా 13.51 రేటింగ్ తో తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు 12.29కే పరిమితమైంది. ఇక చిన్ని సీరియల్ 11.15తో మూడో స్థానంలో ఉండగా.. ఇంటింటి రామాయణం 10.45తో నాలుగో స్థానంలో ఉంది. ఐదు, ఆరు స్థానాల కోసం మగువ ఓ మగువ, గుండెనిండా గుడిగంటలు పోటీ పడుతున్నాయి. తాజా రేటింగ్స్ లో 10.19తో మగువ ఓ మగువ ఐదు, 10.14తో గుండెనిండా గుడిగంటలు ఆరో స్థానంలో ఉన్నాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. మేఘ సందేశం ఈ వారం కూడా టాప్ లోనే ఉంది. ఆ సీరియల్ కు 8.05 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో పడమటి సంధ్యారాగం 7.32 రేటింగ్ తో ఉంది. నిండు నూరేళ్ల సావాసం 7.14, జగద్ధాత్రి 6.39, త్రినయని 6.16 రేటింగ్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎప్పటిలాగే ఏడు నుంచి పది స్థానాల్లో జీ తెలుగులో వచ్చే సీరియల్స్ ఉన్నాయి.
కార్తీకదీపం సీరియల్ గురించి..
బ్రహ్మముడి సీరియల్ టైమ్ స్లాట్ మార్చినప్పటి నుంచీ తెలుగు టీవీ సీరియల్స్ లో కార్తీకదీపం హవా కొనసాగుతోంది. రెండు నెలలుగా ఆ సీరియల్లో టాప్ లో ఉంటోంది. ఈ సీరియల్ తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో గతేడాదే రెండో సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
వచ్చీ రాగానే ఆ సీరియల్ రెండో స్థానానికి దూసుకెళ్లింది. బ్రహ్మముడి రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అయినంత వరకు రెండో స్థానంలో ఉంటూ వచ్చినా.. తర్వాత టాప్ లోకి వెళ్లింది. కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.
టాపిక్