TRP Ratings: మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!-telugu tv serials trp ratings january 3rd week star maa has top 1 place by karthika deepam 2 zee telugu etv gemini top 4 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trp Ratings: మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!

TRP Ratings: మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu
Jan 30, 2025 04:28 PM IST

Telugu TV Serials TRP Ratings January 3rd Week: తెలుగు టీవీ సీరియల్స్‌కు సంబంధించిన జనవరి మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్ లిస్ట్ తాజాగా వచ్చేసింది. అయితే, ఎప్పటిలాగే నెంబర్ వన్ స్థానంలో మళ్లీ స్టార్ మా కొనసాగగా గతం వారం కంటే ఈ వీక్ టీఆర్‌పీ పెరిగింది. ఇతర ఛానెల్స్ స్థానాలు, టాప్ సీరియల్స్ ఏవో చూద్దాం.

మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!
మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!

TRP Ratings Of Telugu Serials This Week: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడకంలో ఉన్న టీవీ ఛానెల్స్ స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, జెమినీ. ఈ తెలుగు టీవీ ఛానెల్స్ నిరంతరం వినోదాన్ని పంచుతు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. మరి వీటిలో ఏ సీరియల్‌కు ఎలాంటి టీఆర్‌పీ రేటింగ్ ఇచ్చి ఆదరించారో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే కార్తీక దీపం 2 సీరియల్ ఎప్పటిలాగే అత్యధిక టీఆర్‌పీతో టాప్ 1లో నిలిచింది. దీనికి 13.16 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఈ ధారావాహిక తర్వాత రెండో స్థానంలో 12.79 టీఆర్‌పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నిలిచింది. ఇక మూడో స్థానంలో చిన్ని (10.73 టీఆర్‌పీ), నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు (10.34 పాయింట్స్), 5వ ప్లేస్‌లో (ఇంటింటి రామాయణం 10.33 టీఆర్‌పీ) ఉన్నాయి.

అయితే, వీటి టార్గెట్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్‌పీ) గత వారం (జనవరి 2వ వారం)తో పోలిస్తే ఈ మూడో వారం పెరిగాయి. గత వారం కార్తీక దీపం 2 సీరియల్‌కు 12.9 ఉంటే ఈ వారం 13.16 ఉంది. అలాగే, మిగతా టాప్ 5 సీరియల్స్ రేటింగ్స్ పెరిగాయి.

టాప్ 8లో బ్రహ్మముడికి స్థానం

ఇక స్టార్ మా ఛానెల్‌లో టాప్ సీరియల్స్‌లో ఒక్కటైన బ్రహ్మముడి 5.46 టీఆర్‌పీతో టాప్ 8 స్థానం దక్కించుకుంది. టాప్ 1లో కొనసాగిన బ్రహ్మముడి గత కొంతకాలంగా టాప్ 10 లోపు లేదా ఆ పైన టీఆర్‌తో తెచ్చుకుంటోంది. ఇక స్టార్ మాలో రేణకు ఎల్లమ్మ సీరియల్ గత వారం 0.72 టీఆర్‌పీ తెచ్చుకుంటే మూడో వారం 0.77 పాయింట్లతో మళ్లీ అత్యధిక తక్కువ రేటింగ్ నమోదు చేసుకున్న సీరియల్‌గా నిలిచింది.

జీ తెలుగు టీఆర్‌పీ

జీ తెలుగులోని 8.05 టీఆర్‌పీతో చామంతి సీరియల్ మొదటి స్థానం తెచ్చుకోగా.. 8.04 అతి స్వల్ప తేడా టీఆర్‌పీతో పడమటి సంధ్యారాగం రెండో ప్లేస్‌లో నిలిచింది. గతవారం టాప్ 3లో ఉన్న చామంతి సీరియల్ మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం సీరియల్స్‌ను దాటేసి టాప్ 1కి వచ్చేసింది.

ఈ వారం మేఘ సందేశం 7.82 టీఆర్‌పీతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక 6.97తో నిండు నూరేళ్ల సావాసం టాప్ 4, 6.91తో జగద్ధాత్రి టాప్ 5 స్థానాలు దక్కించుకున్నాయి. జీ తెలుగులో 1.19తో సీతారామ అతి తక్కువ టీఆర్‌పీ తెచ్చుకుంది. కానీ, స్టార్ మా ఛానెల్‌లోని రేణుక ఎల్లమ్మతో పోలిస్తే బెటర్‌గా సీతారామ టీఆర్‌పీ ఉంది.

ఈటీవీ సీరియల్స్ రేటింగ్

ఇక ఈటీవీ తెలుగులోని 3.71 టీఆర్‌పీతో మనసంతా నువ్వే సీరియల్ మొదటి స్థానంలో ఉండగా.. 3.63తో రంగులరాట్నం టాప్ 2లో, 3.05తో ఝాన్సీ మూడో ప్లేస్, 3.01తో బొమ్మరిల్లు నాలుగో స్థానం, 2.17తో శతమానంభవతి టాప్ 5 స్థానాలు సాధించాయి. గత వారం రంగులరాట్నం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే మనసంతా నువ్వే రెండో స్థానంలో ఉంది. ఈసారి ఈ సీరియల్స్ స్థానాలు మారిపోయాయి.

మారిన టీఆర్‌పీ స్థానాలు

జెమినీ టీవీ ఛానెల్‌లోని శ్రీమద్ రామాయణం సీరియల్‌ 1.06 టీఆర్‌పీతో టాప్ 1లో ఉంది. రెండో స్థానంలో భైరవి (0.83), టాప్ 3లో కొత్తగా రెక్కలొచ్చెనా (0.82), నాలుగో ప్లేస్‌లో నువ్వే కావాలి (0.69), టాప్ 5లో సివంగి (0.68) నిలిచాయి. గతం వారంతో పోలిస్తే ఈ వారం జెమినీ టీఆర్‌పీ పెరిగిన భైరవి, కొత్తగా రెక్కలొచ్చెనా స్థానాలు ఇక్కడ కూడా మారిపోయాయి.

ఇలా తెలుగు టీవీ ఛానెల్స్‌లో సీరియల్స్ అత్యధిక టీఆర్‌పీతో నెంబర్ వన్ స్థానంలో స్టార్ మా ఉంటే రెండో ప్లేస్‌లో జీ తెలుగు నిలిచింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఈటీవీ, జెమినీ సరిపెట్టుకున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం