Telugu TV Serials TRP Ratings: టాప్ 2 తెలుగు సీరియల్స్ ఇవే.. అనూహ్యంగా మూడో స్థానానికి దూసుకొచ్చిన స్టార్ మా సీరియల్
Telugu TV Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 41వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో ఓ స్టార్ మా సీరియల్ అనూహ్యంగా ఆరు నుంచి మూడో స్థానానికి దూసుకు రావడం విశేషం.
Telugu TV Serials TRP Ratings: స్టార్ మాతోపాటు జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. ఇవి 41వ వారానికి సంబంధించిన రేటింగ్స్. ఎప్పటిలాగే స్టార్ మా సీరియల్స్ జోరు కొనసాగింది. అయితే అందులోనూ చిన్ని సీరియల్ అనూహ్యంగా ఐదు నుంచి మూడో స్థానానికి రావడం ఆశ్చర్య పరిచింది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా ఛానెల్ కు చెందిన సీరియల్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఎప్పటిలాగే టాప్ 2లో బ్రహ్మముడి, కార్తీకదీపం 2 సీరియల్స్ ఉన్నాయి. అయితే ఈ రెండింటి టీఆర్పీ రేటింగ్స్ గత వారాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. బ్రహ్మముడి 12.01 రేటింగ్ తో టాప్ లో కొనసాగింది. ఇక కార్తీకదీపం 2 సీరియల్ 11.07తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానానికి చిన్ని సీరియల్ దూసుకొచ్చింది.
గత వారం వరకు ఐదో స్థానంలో ఉన్న ఈ సీరియల్ తాజా రేటింగ్స్ లో 9.83తో మూడో స్థానంలో ఉంది. ఇక గుండెనిండా గుడిగంటలు 9.73తో నాలుగో స్థానంలో, 9.64తో ఇంటింటి రామాయణం ఐదో స్థానంలో ఉన్నాయి. మగువ ఓ మగువ సీరియల్ 8.27తో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
స్టార్ మాలోని ఇతర సీరియల్స్ విషయానికి వస్తే.. నువ్వు నేను ప్రేమ (5.00), సత్యభామ (4.89), నిన్ను కోరి (4.88), పలుకే బంగారమాయెనా (4.85), పాపే మా జీవనజ్యోతి (4.81), మామగారు (4.34) మంచి రేటింగ్స్ సాధించాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఒక్కటి కూడా 7 రేటింగ్ దాటలేదు. అత్యధికంగా పడమటి సంధ్యారాగం 6.87తో టాప్ లో ఉంది. ఇక ఆ తర్వాత జగద్ధాత్రి 6.66, నిండు నూరేళ్ల సావాసం 6.61, మేఘ సందేశం 6.56, త్రినయని 6.25, అమ్మాయిగారు 5.67, మా అన్నయ్య 5 రేటింగ్స్ సాధించాయి.
41వ వారం కూడా ఓవరాల్ తెలుగు సీరియల్స్ లో జీ తెలుగుకు చెందిన పడమటి సంధ్యారాగం ఏడో స్థానంలో ఉంది. తర్వాత జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం ఉన్నాయి. మొత్తంగా టాప్ 10లో జీ తెలుగుకు చెందిన నాలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి.
ఈటీవీ, జెమిని సీరియల్స్ రేటింగ్స్
ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే.. ఈ ఛానెల్లో వచ్చే రంగులరాట్నం మరోసారి సత్తా చాటింది. ఈ సీరియల్ 3.43 రేటింగ్ తో ఛానెల్లో టాప్ లో నిలిచింది. ఆ తర్వాత గువ్వ గోరింక 2.84, రావోయి చందమామ 2.45, శతమానంభవతి 1.86, కాంతార 1.11 రేటింగ్స్ తో ఉన్నాయి.
జెమిని టీవీ సీరియల్స్ చూస్తే.. ఒక్క సీరియల్ తప్ప మిగతావేవీ కనీసం 1 రేటింగ్ దాటలేకపోయాయి. అత్యధికంగా శ్రీమద్ రామాయణం 1.21 రేటింగ్ సాధించింది. ఆ తర్వాత కొత్తగా రెక్కలొచ్చెనా 0.94, సివంగి 0.92, భైరవి 0.85, నువ్వే కావాలి 0.70 రేటింగ్స్ సాధించాయి.