Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్‌లో ఆ రెండు సీరియల్స్ పోటాపోటీ
Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. 51వ వారానికిగాను ఈ రేటింగ్స్ ను రిలీజ్ చేయగా.. టాప్ ప్లేస్ కోసం రెండు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ కూడా మెరుగయ్యాయి.
Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ ఈ ఏడాది 51వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎప్పటిలాగే కార్తీకదీపం సీరియల్ తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే స్టార్ మాలో ఈ మధ్యే మొదలైన సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నుంచి కార్తీక దీపం సీరియల్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. తాజాగా రేటింగ్స్ లో ఈ రెండు సీరియల్స్ టాప్ ప్లేస్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.
కార్తీకదీపం వర్సెస్ ఇల్లు ఇల్లాలు పిల్లలు
స్టార్ మాలో రాత్రి 7.30 గంటల స్లాట్ నుంచి బ్రహ్మముడి వెళ్లిపోయిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్ లోనూ మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ కార్తీకదీపం సీరియల్ టాప్ లోకి దూసుకొచ్చింది. గత కొన్ని వారాలుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇప్పుడు కూడా 12.73 రేటింగ్ తో తొలి స్థానంలోనే కొనసాగింది. అయితే ఈ సీరియల్ కు కొత్తగా వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు గట్టి పోటీ ఇస్తోంది. క్రమంగా టీఆర్పీల్లో తొలి స్థానం వైపు దూసుకొస్తోంది.
తాజా రేటింగ్స్ లో 12.21తో రెండో స్థానంలో ఉన్నా.. కార్తీకదీపం రేటింగ్ తో గ్యాప్ కాస్త తగ్గింది. ఇక మూడు నుంచి ఆరు స్థానాల వరకు కూడా స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. 11.04తో చిన్ని, 10.30తో ఇంటింటి రామాయణం, 9.96తో గుండెనిండా గుడిగంటలు,9.59తో మగువ ఓ మగువ సీరియల్స్ మూడు నుంచి ఆరు వరకు నిలిచాయి. ఈ మధ్యే రాత్రి 10 గంటల నుంచి 9.30 గంటలకు మారిన కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా 6 రేటింగ్ సాధించడం విశేషం. అటు బ్రహ్మముడి కూడా 6.00 రేటింగే సాధించింది.
మెరుగైన జీ తెలుగు సీరియల్స్
జీ తెలుగు సీరియల్స్ కూడా 51వ వారం రేటింగ్స్ లో మెరుగయ్యాయి. ఆ ఛానెల్లో వచ్చే మేఘ సందేశం 8.45 రేటింగ్ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది. ఇక పడమటి సంధ్యారాగం కూడా 7.98 రేటింగ్ సంపాదించింది.
నిండు నూరేళ్ల సావాసం 7.84, జగద్ధాత్రి 6.72, త్రినయని 6.47, మా అన్నయ్య 6.09 రేటింగ్స్ సాధించాయి. మొత్తంగా తెలుగులో టాప్ 10 సీరియల్స్ చూస్తే.. మొదటి ఆరు స్థానాల్లో స్టార్ మా, తర్వాతి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి.
ఈటీవీ, జెమిని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే.. ఈ ఛానెల్లో 3.68 రేటింగ్ తో రంగులరాట్నం టాప్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత 3.39తో మనసంతా నువ్వే, 3.11తో రావోయి చందమామ, 2.80తో బొమ్మరిల్లు, 2.41తో శతమానంభవతి, 1.75తో కలిసుందాం రా సీరియల్స్ ఉన్నాయి.
జెమిని సీరియల్స్ ఎప్పటిలాగే అట్టడుగున నిలిచాయి. ఆ ఛానెల్లో 1.28 రేటింగ్ తో కొత్తగా రెక్కలొచ్చెనా, శ్రీమద్ రామాయణం సీరియల్స్ టాప్ లో ఉన్నాయి. ఆ తర్వాత 1.08తో భైరవి, 1.02తో నువ్వే కావాలి, 0.99తో సివంగి సీరియల్స్ నిలిచాయి.
టాపిక్