Sci -Fi Thriller OTT: టాలీవుడ్ మైథలాజికల్‌థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్
Sci -Fi Thriller OTT: తెలుగు మైథలాజికల్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 26 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ హీరోహీరోయిన్లుగా నటించారు.
Sci -Fi Thriller OTT: టైమ్ ట్రావెల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ రహస్యం ఇదం జగత్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు.
ఈటీవీ విన్ ఓటీటీ...
పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ రూపొందిన రహస్యం ఇదం జగత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో డిసెంబర్ 26న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
అమెరికాలో షూటింగ్...
రహస్యం ఇదం జగత్ మూవీ షూటింగ్ మొత్తం అమెరికాలో సాగడం గమనార్హం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌లో వచ్చిన పలు సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు రహస్యం ఇదం జగత్ కథను రాసుకున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు భారతీయ పురాణాల్లోని శ్రీచక్రం, హనుమంతుడు, శ్రీకృష్ణుడి గాథలను టచ్ చేస్తూఈ సినిమాను రూపొందించాడు. నవంబర్ 8న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
రహస్యం ఇదం జగత్ కథ ఇదే...
తండ్రి చనిపోవడంతో అకీరా (స్రవంతి) అమెరికా నుంచి ఇండియాకు షిఫ్ట్ కావాలని నిర్ణయించుకుంటుంది. అకీరా బాయ్‌ఫ్రెండ్ అభికూడా(రాకేష్) ఆమెతో పాటు ఇండియాలోనే సెటిల్ కావాలని అనుకుంటాడు. ఇండియా వెళ్లేముందు స్నేహితులతో పార్టీ చేసుకోవాలని అభి, అకీరా అనుకుంటారు. ఓ హోటల్‌ను బుక్ చేస్తారు. కానీ ఆ హోటల్ మూసి ఉండటంతో అదే ప్రాంతంలో ఉన్న పాత ఇంట్లోకి అడుగుపెడతారు.
అక్కడే వారి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. అకీరాతో పాటు ఆమె స్నేహితుడు కళ్యాణ్ హత్యకు గురవుతాడు. మరో ఫ్రెండ కమ్ సైంటిస్ట్ అయిన ఆరు (మానసవీణ)...ఆభితో కలిసి మల్టీ యూనివర్స్ ద్వారా మరో కాలంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తుంది? ఆ తర్వాత ఏమైంది? అకీరాను హత్య చేసింది ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
గతం మూవీ...
రహస్యం ఇదం జగత్ కంటే ముందు తెలుగులో గతం సినిమా చేశాడు హీరో రాకేష్. కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. రహస్యం ఇదం జగత్ మూవీకి గ్యానీ మ్యూజిక్ అందించాడు.
టాపిక్