ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా కంటెంటే అందుబాటులో ఉండనుంది. తాజాగా ఒకే ఓటీటీలోకి ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ, తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమాలు రాబోతున్నాయి. తెలుగు మూవీ రెండు నెలల తర్వాత, తమిళ మూవీ నెల రోజుల్లోపే ఈ ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ రెండు మూవీస్ శుక్రవారం (మే 23) నుంచే స్ట్రీమింగ్ కానున్నాయి.
సన్ నెక్ట్స్ ఓటీటీలోకి శుక్రవారం (మే 23) ఈ రెండు మూవీస్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు థ్రిల్లర్ సినిమా వైరల్ ప్రపంచం (Viral Prapancham). మార్చి 7న థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. ఈ మూవీ స్ట్రీమింగ్ పై గురువారం (మే 22) ఆ ఓటీటీ వరుస ట్వీట్స్ చేసింది.
“ఎదురుచూపులు ముగియబోతున్నాయి. వేగంగా కూలిపోయే ప్రపంచాన్ని చూడాటానికి సిద్ధంగా ఉన్నారా? దానిని చూడటం తప్ప ఏమీ చేయలేం. దీనిని ఓ వార్నింగ్ లా భావించండి. మీరు ఎవరిని నమ్ముతున్నారో చూసుకోండి” అనే క్యాప్షన్ తో ముందు ఓ ట్వీట్ చేసింది.
ఆ తర్వాత కాసేపటికే ఓ వీడియోతో మరో ట్వీట్ కూడా వదిలింది. “నిజమైన స్టోరీతో వచ్చిన అన్నింటికీ సంతోషకరమైన ముగింపు ఉండదు. మీరు ఎవరిని నమ్ముతున్నారో కాస్త చూసుకోండి. వైరల్ ప్రపంచం వచ్చేసింది. ప్రేమ, మోసం, అబద్ధాలు, నమ్మకద్రోహ ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో” అనే క్యాప్షన్ తో మరో ట్వీట్ చేసింది.
ఇక సన్ నెక్ట్స్ ఓటీటీలోకే తమిళ స్పోర్ట్స్ కామెడీ మూవీ కూడా రాబోతోంది. ఏప్రిల్ 25, 2025లో రిలీజైన సినిమా ఇది. ఈ మూవీ పేరు సుమో. “మిమ్మల్ని కలవడానికి గణేష్ నేరుగా జపాన్ నుంచి వస్తున్నాడు. సుమో రేపటి నుంచి మీ సన్ నెక్ట్స్ లో” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయం వెల్లడించింది.
ఎస్పీ హొసిమిన్ డైరెక్ట్ చేసిన సినిమా. శివ, ప్రియా ఆనంద్, యొషినోరి తషిరో నటించారు. ఓ సర్ఫర్ గా ఉన్న వ్యక్తికి ఓ బీచ్ లో ఓ జపనీస్ సుమో కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ. బాగా నవ్వించే మూవీ ఇది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది.
సంబంధిత కథనం