Suspense Thriller Movie: కోలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డీ3 తెలుగులోకి వచ్చింది. వీ3 థర్డ్ కేస్ పేరుతో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. తెలుగులో ఫ్రీగా ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వీ3 మూవీలో ప్రజీన్, విద్యా ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. చార్లి, రాహుల్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు. బాలాజీ దర్శకత్వం వహించాడు. తమిళంలో థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగులోకి వచ్చింది. ఈ మూవీకి శ్రీజీత్ మ్యూజిక్ అందించాడు.
2023లో తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ అంశాలతో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్‌ను మెప్పించింది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ పదికిగాను 5.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
విక్రమ్ ఓ పోలీస్ ఆఫీసర్. వీ3 పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుంటాడు. ఒకే రోజు ఓ హిట్ అండ్ రన్ కేసుతో పాటు మిస్సింగ్, మర్డర్ కేసులకు సంబంధించిన కంప్లైంట్స్ వస్తాయి. ఈ మూడు కేసుల ఇన్వేస్టిగేషన్‌ను విక్రమ్ చేపడతాడు. అది యాక్సిడెంట్ కాదు...మర్డర్ అనే నిజం విక్రమ్ కనిపెడతాడు. అలాంటి కేసులు సిటీలో చాలా ఉన్నాయని విక్రమ్ అన్వేషణలో తేలుతుంది. ఈ యాక్సిడెంట్స్‌కు, మిస్సింగ్‌లకు ఉన్న లింక్ ఏంటి? ఈ కేసు ఇన్వేస్టిగేషన్‌లో విక్రమ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? ఈ కేసు కారణంగా విక్రమ్ భార్య మాయ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడింది? రూలింగ్ పార్టీ మినిస్టర్‌కు ఈ హత్యలతో ఏమైనా సంబంధం ఉందా? అన్నదే ఈ మూవీ కథ.
సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రజీత్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో పెన్, అంజలి, గోకులంలో సీతై, చినతంబి, వీరతో పాటు పలు సీరియల్స్‌లో లీడ్ క్యారెక్టర్స్ చేశాడు. ఇటీవలే జీ5లో రిలీజ్ అయిన గెట్టిమేళం తమిళ సీరియల్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడు. హీరోగా డీ3, అక్కు, నీనైవెల్లడం నీయదేతో పాటు మరికొన్ని సినిమాల్లో కనిపించాడు.
నాయగి సీరియల్‌తోనే తమిళంలో విద్యా ప్రదీప్ ఫేమస్ అయ్యింది. తమిళంలో తళైవి, సెల్ఫీ, సెకండ్ షో, ఇన్పినిటీతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది.
సంబంధిత కథనం