OTT Suspense Thriller: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు - ఎక్కడ చూడాలంటే?
OTT Suspense Thriller: తెలుగు థ్రిల్లర్ మూవీస్ డెడ్‌లైన్, మహిషాసురుడు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్‌లో మూవీలో అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్ ప్రధాన పాత్రలు పోషించారు. మహిషాసురుడు మూవీలో రిచా, ధరణి రెడ్డి నటించారు.
OTT Suspense Thriller: ఒకేరోజు రెండు సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. డెడ్‌లైన్‌తో పాటు మహిషాసురుడు సినిమాలు ఎయిర్‌టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ట్రీమ్‌ప్లేలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందగా...మహిషాసురుడు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
అజయ్ ఘోష్ పోలీస్ ఆఫీసర్...
డెడ్‌లైన్ మూవీలో అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. బొమ్మరెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. జూలీ, రాబర్ట్ భార్యాభర్తలు. ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. లాంగ్ డ్రైవ్ కోసం వెళతారు. దారిలో మోనీ అనే అమ్మాయి లిఫ్ట్ అడగటంతో ఇస్తారు.
మోనీ ఓ సీరియల్ కిల్లర్. జాలీ, రాబర్ట్‌లను చంపేస్తుంది. ఈ మర్డర్‌కేసును ఎస్ఐ ముఖేష్ ఎలా సాల్వ్ చేశాడు? మోనీ సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణమేమిటి? అసలు జాలీ, రాబర్ట్ నిజంగా భార్యాభర్తలేనా? వారి గురించి ముఖేష్ తెలుసుకున్న షాకింగ్ నిజం ఏమిటన్నదే పాయింట్‌తో డెడ్‌లైన్ మూవీ సాగుతుంది.
ఫిబ్రవరిలో రిలీజ్...
ఈ చిన్న సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ ఘోష్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. బోల్డ్ రొమాంటిక్ అంశాలతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. గత ఏడాది ఫిబ్రవరిలో డెడ్‌లైన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. కాన్సెప్ట్ బాగున్నా... ప్రొడక్షన్ వాల్యూస్ నాసిరకంగా ఉండటం, అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్ మినహా మిగిలిన యాక్టింగ్ తేలిపోవడంతో డెడ్‌లైన్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
బాలీవుడ్‌లో...
అపర్ణ మాలిక్ హిందీలో సీతాపూర్ ది సిటీ ఆఫ్ గ్యాంగ్స్‌స్టర్స్, శశాంక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. డెడ్‌లైన్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్..
మహిషాసురుడు మూవీలో రిచా, ధరణి రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పొలిటీషియన్ ముసుగులతో అమ్మాయిలకు అన్యాయం చేస్తోన్న ఓ పెద్ద మనిషిపై సాధారణ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్‌తో మషిషాసురుడు మూవీ తెరకెక్కింది. మహిషాసురుడు సినిమాకు గోగుంట రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ గత ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదలైంది.
ఇతర ఓటీటీ మూవీస్ కూడా...
మహిషాసురుడు, డెడ్‌లైన్‌తో షాడో, ఎప్ పీఎమ్, డెటిక్టివ్ డేవిడ్, సుకన తో పాటు పలు పలు తెలుగు చిన్న సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే లో అమెజాన్, సన్ నెక్స్ట్, ఆహాతో పాటు మిగిలిన ఓటీటీలలో రిలీజైన సినిమాలు చూడొచ్చు. ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు నెలకు 149..ఏడాదికి 1499గా ఉన్నాయి. తెలుగు మాత్రమే కాకుండా ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాలు చూడొచ్చు. టీవీ షోస్, వెబ్‌సిరీస్‌లు ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.