తెలుగులో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. పెళ్లి రోజే చనిపోయే పెళ్లికూతుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-telugu supernatural thriller web series viraatapalem pc meena reporting ott release date zee5 ott to stream ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తెలుగులో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. పెళ్లి రోజే చనిపోయే పెళ్లికూతుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగులో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. పెళ్లి రోజే చనిపోయే పెళ్లికూతుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి తెలుగులో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. 1980ల నేపథ్యంలో ఓ గ్రామానికి ఉన్న శాపం చుట్టూ తిరిగే కథతో ఆసక్తి రేపుతోంది. పెళ్లి రోజే పెళ్లికూతుళ్లు చనిపోవడం అనే భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సిరీస్ వస్తోంది.

తెలుగులో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. పెళ్లి రోజే చనిపోయే పెళ్లికూతుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగులో వస్తున్న మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్. ఈ సిరీస్ ను జీ5 (ZEE5) ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 17) ఆ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది. గతంలో రెక్కీ అనే వెబ్ సిరీస్ అందించిన మేకర్సే తాజాగా ఈ థ్రిల్లర్ సిరీస్ తీసుకురాబోతుండటం విశేషం.

విరాటపాలెం వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్

‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే టైటిల్ తో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. కృష్ణ పోలూరు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్.. జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజులాంటి వాళ్లు ఇందులో నటించారు.

విరాటపాలెం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలోని రహస్యాలు, వాటిని ఛేదించే క్రమాన్ని ఇందులో చూడొచ్చు. దీనిని ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు.

విరాటపాలెం వెబ్ సిరీస్ స్టోరీ ఇదే..

1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం ఏంటంటే.. ప్రతి వధువు తన పెళ్లి రోజునే మరణించడం. దీనివల్ల దశాబ్ద కాలంగా అక్కడ ఏ వివాహం జరగదు. ఇది తమ గ్రామానికి పట్టిన శాపమే అని అక్కడి వాళ్లు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి వస్తుంది. ఆమె అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

వెబ్ సిరీస్ మంచి థ్రిల్ అందించడంతోపాటు ఓ సామాజిక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ అన్నారు. గతంలో రెక్కీ అనే వెబ్ సిరీస్ అందించిన దర్శకుడు కృష్ణ పోలూరే ఈ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేశాడు. పెళ్లి రోజే వధువు చనిపోవడం అనే భయం ఆ ఊరిని పెళ్లిళ్లకు ఎలా దూరం చేసింది? దానిని ఎలా ఛేదించారన్నదే ఈ సిరీస్ కథ అని అతడు చెప్పాడు.

మూఢనమ్మకాలను చూపిస్తూనే ఓ శక్తివంతమైన సందేశంతో ఉత్కంఠ భరితమైన ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇది కేవలం సూపర్‌నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు భయం, నిజం మధ్య జరిగే ఓ యుద్ధంగా ఉండనుంది. జూన్ 27 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం