Heroes: తెలుగు స్టార్ హీరోలు బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీసుకెళ్లేవి ఇవే.. మీరు కూడా అంతేనా?
Tollywood Star Heroes Carries Things: సాధారణంగా బయటకెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు కచ్చితంగా కొన్ని వస్తువులను తీసుకెళ్తుంటారు. మరి అలా టాలీవుడ్ స్టార్ హీరోలు బయటకు, వెకేషన్‌కు వెళ్లినప్పుడు తీసుకెళ్లేటివి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో మీరు తీసుకెళ్లేవి కూడా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి.
Tollywood Star Heroes Carries Things: సాధారణంగా బయటకు వెళ్తున్నామంటే మొబైల్, పర్స్, ఇయర్ బర్డ్స్ వంటి కొన్ని ముఖ్యమైన వస్తువులను మన వెంట తీసుకెళ్తుంటా. ఏదైనా టూర్, వెకేషన్‌కు వెళ్తే మరింత అవసరమైనవన్నీ పట్టుకెళ్తాం. మరి మనలాగే స్టార్ హీరోలు బయటకు వెళ్తే ఎలాంటివి పట్టుకెళ్తారు. అందుకే.. మన టాలీవుడ్ స్టార్ హీరోలు బయటకు గానీ, ఏదైనా టూర్, వెకేషన్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా తమతో తీసుకెళ్లేవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఇటీవలే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఆర్‌సీ16 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, బయటకు వెళ్లినప్పుడు రామ్ చరణ్ తన వెంట కచ్చితంగా తీసుకెళ్లేది పెంపుడు కుక్కపిల్ల. ఈవెంట్స్, మూవీ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు తనతోపాటే ఆ కుక్కపిల్ల రైమ్‌ను కూడా రామ్ చరణ్ తీసుకెళ్తాడు. ఇటీవలే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మతోపాటు ఆ కుక్కపిల్ల స్టాచ్యూని కూడా ఉంచారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ కుక్కపిల్ల రైమ్‌ను చెర్రీ ఎంతలా బయటకు తీసుకెళ్తాడో.
రెండో పెంపుడు జంతువుగా
అంతేకాకుండా మైనపు బొమ్మ కలిగిన రెండో పెంపుడు జంతువుగా రైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల అన్‌స్టాపబుల్ 4 ఎపిసోడ్‌కు వచ్చిన రామ్ చరణ్ చెప్పారు. ఆ షోకి కూడా రైమ్ వచ్చి సందడి చేయడం విశేషం.
ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అతిథులకు భోజనం పెట్టడమే కాకుండా ఫుడ్ తినడం అన్న కూడా మహా ఇష్టం. బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తినడం ప్రభాస్‌కు అలవాటు అట. అందుకే, బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండిన ఆహారాన్నే తింటారని సమాచారం. కాబట్టి, తను బయటకు వెళ్లినప్పుడు తనతోపాటే ఇంటి ఫుడ్ కూడా ప్రభాస్ వెంట ఉంటుంది.
అల్లు అర్జున్
పుష్ప ది రైజ్ సినిమాతో ఐకానిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇటీవలే పుష్ప 2 ది రూల్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొడుతూ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు. అలాగే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో కాస్తా వివాదంలో కూడా చిక్కుకున్నాడు అల్లు అర్జున్.
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీసుకెళ్లే వస్తువు కెమెరా అని టాక్. అల్లు అర్జున్‌కు ఎక్కువగా ఫొటోలు తీసే అలవాలటు ఉందట. అందుకే తను ఏదైనా మూవీ ఈవెంట్‌కు వెళ్లిన, ఏదైన షూటింగ్‌కు వెళ్లినప్పుడు తనతోపాటు కెమెరాను అల్లు అర్జున్ తీసుకెళ్తాడని సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్