కోలీవుడ్ ప్రొడ్యూసర్ కేజేఆర్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. గుర్తింపు పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోన్నాడు. స్పోర్ట్స్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి తెన్‌పతియాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న గుర్తింపు మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో స్పోర్ట్స్ జెర్సీ ధరించి కోర్ట్‌లో హీరో కేజేఆర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోన్నాడు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తోన్నారు.
టైటిల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- " పేదరికంలో మగ్గే ఓ క్రీడాకారుడు.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు సాగించే ప్రయాణం నేపథ్యంలో గుర్తింపు మూవీ సాగుతుంది. ఆటుపోట్లను దాటుకుంటూ క్రీడాకారుడిగా ఎదిగిన తీరు, గుర్తింపు కోసం పడిన శ్రమ, ఎదురైన సవాళ్లను దర్శకుడు తెన్‌పతియాన్ థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నారు. ఎమోషన్స్‌కు ఇంపార్టెంట్స్ ఉంటుంది.
గుర్తింపు మూవీ షూటింగ్ 85 శాతం పూర్తయింది. ఇంతకు ముందు మా బ్యానర్ ద్వారా శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ వరుణ్ సినిమాను రిలీజ్ చేశాం. పెద్ద హిట్టయింది. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ సినిమాను తెరకెక్కించాను. గత సినిమాలకు మించి గుర్తింపు హిట్టవుతుందనే నమ్మకముంది.
స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా తెరకెక్కుతోన్న గుర్తింపు మూవీలో కేజేఆర్‌తో పాటు సింధూరి విశ్వనాథ్, వీ.ఈవెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గుర్తింపు సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాదే గుర్తింపు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నిర్మాతగా కేజీఆర్ తమిళంలో శివకార్తికేయన్‌తో హీరో, డాక్టర్, అయలాన్ సినిమాలు చేశారు. విజయ్ సేతుపతి కాపే రణసింగం, ప్రభుదేవా గులేభకావలి సినిమాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నాడు కేజీఆర్. విశ్వం, దబాంగ్ 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు.
సంబంధిత కథనం