కాంతార సీరియల్‌కు ఈటీవీ శుభం కార్డు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సీరియల్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ వీక్‌లోనే కాంతర సీరియల్ ముగియనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంతార సీరియల్ గత ఏడాది జూలైలో మొదలైంది. ఈ సీరియల్‌లో గౌరవ్, అక్షయ, పవన్, రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. శరత్ దర్శకత్వం వహించాడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సీరియల్‌లో హీరోయిన్ నేహా దేశ్‌పాండే మరో ఇంపార్టెంట్ రోల్‌లో నటించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.
ఇందులో కాంతరగా టైటిల్ పాత్రలో అక్షయ తన యాక్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాంతార గోపి ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. కానీ పెద్దలు మాత్రం వారి ప్రేమను అంగీకరించరు. అనుకోని పరిస్థితుల్లో యువరాజుతో కాంతార పెళ్లి జరుగుతుంది. ఒకరిని ప్రేమించి మరొకరి భార్యగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన కాంతర ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? మనసుకు మాంగళ్యానికి మధ్యకాంతార ఎలా నలిగిపోయింది అన్నదే ఈ సీరియల్ కథ.
ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం రెండు గంటలకు ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.
కాంతార క్లైమాక్స్ డేట్ మే 18 అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ రోజుతో ఈ సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేయబోతున్నట్లు తెలిసింది. కాంతార స్థానంలో వేయి శుభములు కలుగు నీకు సీరియల్ మొదలుకానున్నట్లు సమాచారం. మే 20 నుంచి ఈ కొత్త సీరియల్ మొదలుకాబోతున్నట్లు సమాచారం.
కాంతారతో పాటు మరో సీరియల్ మౌన పోరాటం కూడా ఎండింగ్‌కు చేరినట్లు తెలిసింది. యుమన ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ కూడా ఈ వారంలోనే ముగిసే అవకాశం ఉందని అంటున్నారు.
వేయి శుభములు కలుగు నీకుతో పాటు తెలుగులో ఆరోప్రాణం, రంగ రంగ పాండురంగ, యశోదతో పాటు మరికొన్ని సీరియల్స్ త్వరలోనే ఈటీవీలో మొదలుకాబోతున్నాయి.
కాంతార సీరియల్‌లో కీలక పాత్రలో నటించిన నేహా దేశ్ పాండే తెలుగులో వజ్రాలు కావాలా నాయనా, దిల్ దివానా, ది బెల్స్, వాడేనా, బిచ్చగాడా మజాకాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. లవ్ సెక్స్ అండ్ డెత్ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.
సంబంధిత కథనం