Telugu Serial: క్లైమాక్స్ లేకుండానే తెలుగు సీరియల్‌కు ఎండ్‌కార్డ్ - ఫ్యాన్స్‌కు షాకిచ్చిన జీ తెలుగు
Telugu Serial: జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు జీ తెలుగు అర్ధాంతరంగా ఎండ్ కార్డ్ వేసింది. క్లైమాక్స్ లేకుండానే ఈ సీరియల్‌ను ముగించింది. ఈ తెలుగు సీరియల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ రాజశేఖర్, స్రవంతిక కీలక పాత్రల్లో నటించారు.
Telugu Serial: బిగ్‌బాస్ ఫేమ్ రాజశేఖర్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న జాబిల్లి కోసం ఆకాశమల్లే అర్థాంతరంగా ఆగిపోయింది. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్‌కు క్లైమాక్స్ లేకుండానే మేకర్స్ గుడ్‌బై చెప్పారు. . డిసెంబర్ 30 నాటితో ఈ సీరియల్‌కు ఎండ్‌కార్డ్ పడింది.
డిసెంబర్ 31కి లాస్ట్...
మంగళవారం (డిసెంబర్ 31న) జాబిల్లికోసం ఆకాశమల్లే సీరియల్ టైమ్‌లో జానకిరామయ్యగారి మనవరాలు టెలికాస్ట్ అయ్యింది . ఏకంగా ఈ సీరియల్‌ను గంట పాటు ప్రసారం చేశారు. ఆ తర్వాత కూడా జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌ను స్క్రీనింగ్ చేయలేదు. జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు ముగింపు పడనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తోన్నాయి. మంగళవారం ఈ సీరియల్ టెలికాస్ట్ కాలేకపోవడంతో సీరియల్ ముగిసింది నిజమేనని మేకర్స్ చెబుతోన్నారు.
సాగతీతగా...
క్లైమాక్స్ లేకుండా సీరియల్‌కు ముగింపు పలకడం బుల్లితెర ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా సీరియల్ సాగతీతగా మారిపోయిందని, ఎండ్ చేసి మంచి పనిచేశారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ప్రాపర్ క్లైమాక్స్‌తో ఎండ్ చేస్తే బాగుండేదని కామెంట్స్ చేస్తోన్నారు.
సీజన్ 2 ఉంటుందా...
2023 అక్టోబర్‌లో జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ మొదలైంది. ఆరంభంలో టీఆర్‌పీ రేటింగ్‌లో అదరగొట్టింది. జీ తెలుగు సీరియల్స్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా నిలిచింది. మధ్యాహ్నం టైమ్ స్లాట్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాత సీరియల్స్ క్రేజ్ తగ్గుముఖం పడుతూ వచ్చింది. 384 ఎపిసోడ్స్‌తో ఈ సీరియల్‌కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. చాలా వరకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సీరియల్‌ను ముగించిన నేపథ్యంలో జాబిల్లి కోసం ఆకాశమల్లేకు సీజన్ 2 ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టీఆర్‌పీలో జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ 2.21 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకున్నది.
రాజశేఖర్, స్రవంతిక...
జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌లో రాజశేఖర్‌తో పాటు స్రవంతిక కీలక పాత్ర పోషించింది. తమిళ నటి అయిన స్రవంతిక ఈ సీరియల్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రిన్సి బాలకృష్ణన్, శివ పార్వతి, ఇంద్రనాగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
టైమింగ్స్ ఛేంజ్...
జీ తెలుగులో బుధవారం నుంచి చామంతి పేరుతో కొత్త సీరియల్ మొదలుకాబోతుంది. ఈ సీరియల్ కోసం జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయడంతో పాటు జానకిరామయ్యగారి మనవరాలు, త్రినయని సీరియల్స్ టైమింగ్స్‌ను జీ తెలుగు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. .
బిగ్‌బాస్ సీజన్ 6…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు రాజశేఖర్. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు 84వ రోజు ఎలిమినేట్ అయ్యాడు.జాబిల్లికోసం ఆకాశమల్లేతో పాటు తెలుగులో కళ్యాణ వైభోగమే, మనసంతా నువ్వే సీరియల్స్ చేశాడు రాజశేఖర్. కొన్ని యాడ్స్‌లో నటించాడు.