Serial Heroines: పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ వీళ్లే!
Telugu Serial Heroines Live In Relationships: బుల్లితెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా అలరించారు. వారిలో పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ ఎవరు, వారు డేటింగ్ చేస్తున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకుందాం.
TV Serial Heroines Dating Telugu: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అందమైన నటీమణులు హీరోయిన్స్‌గా అలరించారు. తెలుగు సీరియళ్లతో ఇతర భాషా ముద్దుగుమ్మలు సైతం ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కో స్టార్స్‌తో సహజీవనం చేసేవాళ్లు ఉన్నారు. మరి వారు ఎవరో చూద్దాం.
ప్రియాంక జైన్- శివ్ కుమార్
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ సీరియల్ యాక్టర్ శివ కుమార్‌తో డేటింగ్‌లో ఉంది. మౌనరాగం సీరియల్‌తో పరిచయమైన వీరి స్నేహం తర్వాత ప్రేమగా మారింది. అప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని చెబుతున్న ఈ జంట చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. రీసెంట్‌గా కొత్త ఇంట్లోకి మకాం మార్చారు.
కీర్తి భట్-కార్తీక్ తోట
కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు వారికి బాగా పరిచయమైన బ్యూటి కీర్తి భట్. కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. కార్తీక్ తోట అనే వ్యక్తితో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కీర్తి భట్ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు.
శోభా శెట్టి-యశ్వంత్
కార్తీకదీపం సీరియల్ తెలిసినవారికి మోనిత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్‌లో మోనితగా అద్భుతమైన విలనిజాన్ని పండించింది శోభా శెట్టి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. అయితే, తన ప్రియుడు యశ్వంత్‌తో శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగింది. కానీ, పెళ్లి మాత్రం అప్పుడే చేసుకోమని, కొత్త ఇల్లు కొనుగోలు చేసి అందులోనే సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
సిరి హన్మంతు-శ్రీహాన్
పలు యూట్యూబ్ వెబ్ సిరీసులతో పాపులర్ అయిన సిరి హన్మంతు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌లో కూడా యాక్ట్ చేసింది. బిగ్ బాస్ తెలుగు 6 రన్నరప్ అయిన శ్రీహాన్‌తో సిరి చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా కలిసే ఉంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరు ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
సిద్ధు పవన్-సోనియా సింగ్
యూట్యూబ్ వెబ్ సిరీసులు, టీవీ షోలలో వైరల్ కామెంట్స్‌తో చాలా పాపులర్ అయింది సోనియా సింగ్. విరూపాక్ష మూవీలో కీ రోల్ కూడా ప్లే చేసింది. యూట్యూబ్ సిరీస్‌ల నుంచే ప్రేమలో ఉన్నారు సోనియా సింగ్, సిద్ధూ పవన్. వీరిద్దరు కూడా చాలా కాలంగా ప్రేమలో ఉంటూ లివింగ్ రిలేషన్ మేయింటేన్ చేస్తున్నారు.
ఈటీవీ విన్ ఓటీటీలో
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నవాళ్లలో ఈ జంట కూడా ఉంది. కాగా ఇటీవల వీరిద్దరు కలిసి రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు. సోనియా సింగ్, పవన్ సిద్ధూ కలిసి నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ శశి మథనం. ఈ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.