తెలుగు సీరియల్ యాక్టర్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో ఈ కన్నడ మూవీని రిలీజ్ చేశారు. నైట్ రోడ్ సినిమాలో జ్యోతిరాయ్‌తోపాటు ధర్మ, గిరిజా లోకేష్, రేణు శిఖారీ కీలక పాత్రల్లో నటించారు. గోపాల్ దర్శకత్వం వహించారు.
గత ఏడాది థియేటర్ల లో నైట్ రోడ్ మూవీ రిలీజైంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో నైట్ రోడ్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించింది. మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కర్మ సిద్ధాంతానికి సూపర్ నాచురల్ అంశాలను జోడించి దర్శకుడు గోపాల్ నైట్ రోడ్ సినిమాను రూపొందించాడు. ఇందులో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ రోల్‌లో జ్యోతిరాయ్ నటించింది.
బెంగళూరు, మైసూరు మధ్యలో ఉన్న కడతి అనే రోడ్‌లో ప్రతి అమావాస్య రోజు ఓ యాక్సిడెంట్ జరిగి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుంటారు. ఆఫీసర్ దీక్ష (ధర్మ) తమ్ముడు కళ్యాణ్ (సాచి) ఓ డ్రగ్ అడిక్ట్. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో కళ్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయాలని అనుకుంటారు. పోలీసులకు దొరక్కుండా పారిపోయే క్రమంలో కడతి రోడ్ యాక్సిడెంట్‌లో కళ్యాణ్ చనిపోతాడు. అతడిని వాహనం ఢీ కొట్టినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించవు.
అదే ప్లేస్‌లో అంతకుముందు కళ్యాణ్ స్నేహితుడు సూరప్ప కూడా చనిపోయినట్లుగా దీక్ష ఇన్వేస్టిగేషన్‌లో బయటపడుతుంది. ఈ రెండు హత్యలకు ఆ ప్లేస్‌కు ఉన్న సంబంధమేమిటి? నిజంగానే కళ్యాణ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? అతడిని ఎవరైనా హత్యచేశారా? అమావాస్య యాక్సిడెంట్స్ మిస్టరీని దీక్ష ఎలా ఛేదించాడు అన్నదే ఈ మూవీ కథ.
కొన్నాళ్లుగా సీరియల్స్‌కు దూరంగా ఉంటోన్న జ్యోతిరాయ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో ఏ మాస్టర్ పీస్‌తో పాటు కిల్లర్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలకు ఆమె భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కిల్లర్ మూవీలో జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుకు పూర్వజ్ హీరోగా కనిపించబోతున్నాడు. తెలుగు కంటే ముందు కన్నడ, తులు భాషల్లో పలు సినిమాలు చేసింది.
గుప్పెడంత మనసు సీరియల్ తెలుగులో జ్యోతిరాయ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సీరియల్‌లో జగతిగా కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే తల్లి పాత్రలో అసమాన నటనను కనబరిచింది. గత ఏడాది గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు పదిహేనుకుపైగా సీరియల్స్ చేసింది.
సంబంధిత కథనం