Premaku Jai Movie: అనిల్ బూరగాని, ఆర్ జ్వలిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ప్రేమకు జై మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించాడు.
సీరియల్ యాక్టర్ అయిన అనిల్ బూరగాని ప్రేమకు జై మూవీతోనే మూవీతోనే హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో అనిల్ బూరగాని మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. సినిమాల్లో హీరోగా నటించాలనే ఓ యువకుడు తన కలను ఎలా ఎలా నెరవేర్చుకున్నాడు?
ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన అతడికి ఆమె ఎందుకు దూరమైంది? వారి ప్రేమకు కులాలు, ఆస్తులు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే పాయింట్‌తో ప్రేమకు జై మూవీ తెరకెక్కినట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రేమకు జై మూవీ గురించి డైరెక్టర్ మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని ఓ లవ్‌స్టోరీతో సరికొత్తగా ఈ మూవీ ఉంటుంది. అనిల్ బురగాని, జ్వలిత కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది" అని అన్నారు.
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న మూవీ ఇదని, ఇందులో అంతర్లీనంగా సినిమా కష్టాలను చూపించబోతున్నట్లు అనిల్ బూరగాని చెప్పాడు.శుక్రవారం థియేటర్‌లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు. దుబ్బాక భాస్కర్ విలన్‌గా నటించిన ఈ మూవీకి చైతూ మ్యూజిక్ అందించాడు.
తెలుగులో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్‌లో కీలక పాత్రలో అనిల్ బూరగాని నటించాడు. ప్రస్తుతం ఈ సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో అవినాష్ అనే పాత్రలో అనిల్ కనిపిస్తున్నాడు.
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ 4.32 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. కలవారి కోడలు కనక మహాలక్ష్మితో పాటు తెలుగులో మరికొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించాడు.
సంబంధిత కథనం