Thriller Movie OTT: మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ చిత్రం.. అదిరే ట్విస్టులతో మూవీ-telugu sci fi thriller movie aarambham to streaming on third ott aha after etv win and amazon prime video ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Movie Ott: మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ చిత్రం.. అదిరే ట్విస్టులతో మూవీ

Thriller Movie OTT: మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ చిత్రం.. అదిరే ట్విస్టులతో మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 10, 2024 11:25 PM IST

Aarambham OTT Streaming: ఆరంభం సినిమా మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇప్పుడు మూడో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Thriller Movie: మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ చిత్రం.. అదిరే ట్విస్టులతో మూవీ
OTT Thriller Movie: మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ చిత్రం.. అదిరే ట్విస్టులతో మూవీ

ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. ఓటీటీ డీల్స్ కారణంగా ఇలా జరుగుతోంది. కానీ ఒకే సినిమా.. ఒకే భాషలో మూడు ఓటీటీల్లోకి రావడం కాస్త అరుదే. అయితే, తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆరంభం’ ఈ ఫీట్ సాధిస్తోంది. ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. మరో ఓటీటీలోకి కూడా వస్తోంది. మోహన్ భగత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాకు అజయ్ నాగ్ వీ దర్శకత్వం వహించారు. ఆరంభం మూవీ కొత్తగా ఏ ఓటీటీలోకి రానుందంటే..

ఆహా ఓటీటీలోకి..

ఆరంభం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జూలై 11) స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు వెల్లడించింది. జూలై 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. “ఆరంభం సినిమా ఆహాలోకి వచ్చేస్తోంది. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీలో థ్రిల్లింగ్‍గా ఉండే డెజావూ ఎఫెక్ట్‌ను అనుభూతి చెందండి. ఆరంభం జూలై 11న సాయంత్రం 6 గంటలకు ఆహాలో ప్రీమియర్ అవుతుంది” అని సోషల్ మీడియాలో ఆహా పోస్ట్ చేసింది.

మూడో ఓటీటీలో..

ఆరంభం సినిమా మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. డెజావు కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. టాక్ బాగానే దక్కించుకుంది. అయితే, రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. మే 23వ తేదీన ఆరంభం సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఆరంభం చిత్రం ఇటీవలే జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా రానుంది. ఇలా.. మూడో ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. భవిష్యత్తులో మూడు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కొనసాగుతుందా.. లేకపోతే దేంట్లో అయినా మాయం అవుతుందా అనేది చూడాలి.

ఆరంభం సినిమా డెజావూ కాన్సెప్ట్‌తో ఆసక్తికరమైన కథనంతో వచ్చింది. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రంలో మోహన్ భగత్, సుప్రీతా సత్యనారాయణ, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, అభిషేక్ కీలకపాత్రలు పోషించారు. కన్నడ రచన నీను నిన్నోళగి ఖైదీ నుంచి కథ తీసుకొని ఈ మూవీని దర్శకుడు అజయ్ నాగ్ తెరకెక్కించారు. ఈ మూవీకి సింజీత్ ఎర్రమిల్లి సంగీతం అందించారు.

హరోం హర, ధూమం చిత్రాలు

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జూలై 11) హరోం హర చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం అందుబాటులోకి ఉండనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. చిత్తూరు బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈటీవి విన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వస్తోంది.

ధూమం సినిమా కూడా రేపు (జూలై 11) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో ఆహాలో అడుగుపెడుతోంది. గతేడాది జూన్‍లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

WhatsApp channel