ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?-telugu romantic thriller web series devika and danny teaser jiohotstar to stream soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ టీజర్ ను శుక్రవారం (మే 9) రిలీజ్ చేశారు. రీతూ వర్మ ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలోకి తెలుగులోనూ డిఫరెంట్ జానర్ల వెబ్ సిరీస్ వస్తున్నాయి. అందులో ఒకటి దేవిక అండ్ డానీ (Devika and Danny). ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను జియోహాట్‌స్టార్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. కొన్ని రోజుల కిందటే ఈ సిరీస్ ను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా శుక్రవారం (మే 9) టీజర్ రిలీజ్ చేసింది.

దేవిక అండ్ డానీ టీజర్

హాట్‌స్టార్ స్పెషల్స్ గా రూపొందున్న వెబ్ సిరీస్ ఈ దేవిక అండ్ డానీ. ఈ సిరీస్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇది అనుకోకుండా కలిసిన రెండు మనసుల కథ. లవ్ స్టోరీలను రూల్స్ ప్రకారమే ఆడాలని ఎవరు చెప్పారు? దేవిక అండ్ డానీ టీజర్ వచ్చేసింది. కిశోరుడు డైరెక్ట్ చేశాడు” అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ ఈ టీజర్ రిలీజ్ చేసింది. సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అని మాత్రం ఆ ఓటీటీ చెప్పింది.

టీజర్ ఎలా ఉందంటే?

దేవిక అండ్ డానీ టీజర్ ఇంట్రెస్టింగ్ సాగింది. ఈ టీజర్ మొదట్లోనే ఇందులో డానీ పాత్రను ఓ లారీ గుద్దేసినట్లుగా చూపించారు. ఆ తర్వాత నా పేరు దేవికా నందన్ అంటూ ఫిమేల్ లీడ్ ను పరిచయం చేశారు. తనకు ఇప్పటి వరకూ 20 కి.మీ. పరిధి మాత్రమే తెలుసని, ఇల్లు, స్కూలు తప్ప మరో ప్రపంచం తెలియదని ఆమె చెబుతుంది.

సర్దుకుపోయి బతకడం తనకు కొత్త కాదని, పెళ్లికి కూడా అలాగే సిద్ధమైనట్లు ఆమె అంటుంది. ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. తన జీవితంలో మ్యాజిక్ అంటూ ఏదీ లేదని చెప్పగానే.. ఆమె జీవితంలోకి డానీ అనే వ్యక్తి ఎంటరవుతాడు. అది ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. అతనితో కలిసి సరదాగా గడపడాన్ని టీజర్లో చూపించారు.

విధి ఓ విచిత్రమైన సబ్జెక్ట్ అని, ఊహకందని ఛాప్టర్లు వస్తుంటాయని, తన జీవితంలోకీ అలాంటిది వచ్చిందని దేవిక చెప్పడంతో ఈ టీజర్ ముగుస్తుంది. అసలు దేవిక జీవితంలో ఏం జరిగింది? ఆ డానీ ఎవరు? ఈ ఇద్దరూ కలుస్తారా లేదా అన్నది దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ లో చూడాలి.

దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ గురించి..

దేవిక అండ్ డానీ వెబ్‌సిరీస్‌లో రీతూవ‌ర్మ‌తో పాటు శివ కందుకూరి, సూర్య‌కిర‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సిరీస్‌కు బి కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూవ‌ర్మ పాత్ర డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దేవిక అండ్ డానీ సిరీస్‌కు జ‌య్ క్రిష్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

ఈ వెబ్‌సిరీస్ కంటే ముందు తెలుగులో శ్రీకారం అనే సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు కిషోర్‌. వ్య‌వ‌సాయం గొప్ప‌త‌నాన్ని వివ‌రిస్తూ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీకారం త‌ర్వాత సినిమాల‌కు లాంగ్ గ్యాప్ తీసుకున్న బి కిషోర్ వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోన్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం