Romantic OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ మూవీ నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌!-telugu romantic movie love reddy trending in amazon prime video and aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romantic Ott: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ మూవీ నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌!

Romantic OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ మూవీ నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2025 10:22 PM IST

Romantic OTT: తెలుగు రొమాంటిక్ మూవీ ల‌వ్ రెడ్డి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు స్మ‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రొమాంటిక్ ఓటీటీ
రొమాంటిక్ ఓటీటీ

Romantic OTT: తెలుగు రొమాంటిక్ మూవీ ల‌వ్ రెడ్డి ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా అద‌ర‌గొడుతోంది. మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.

yearly horoscope entry point

అమెజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్‌గా ల‌వ్ రెడ్డి ట్రెండ్ అవుతోన్నట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలో సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఓటీటీ ద్వారా త‌మ సినిమా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత రీచ్ అయ్యింద‌ని వెల్ల‌డించారు.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌...

ల‌వ్ రెడ్డి సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టించారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు స్మ‌ర‌ణ్‌ రెడ్డి ఈ సినిమాను రూపొందించాడు. అక్టోబర్ 18న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ దాదాపు రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

ల‌వ్ రెడ్డి క‌థ ఇదే...

నారాయ‌ణ‌రెడ్డి (అంజ‌న్ రామ‌చంద్ర‌)ది ఆంధ్రా, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోని ఓ ప‌ల్లెటూరు. ఓ గార్మెంట్ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తుంటాడు. 30 ఏళ్లు వ‌చ్చినా నారాయ‌ణ‌రెడ్డికి పెళ్లి కాదు. వ‌చ్చిన సంబంధాల‌న్నీ ఏదో ఒక‌ సాకుతో రిజెక్ట్ చేస్తుంటాడు. నారాయ‌ణ రెడ్డికి పెళ్లి కాద‌ని అత‌డి కుటుంబంతో పాటు స్నేహితులు ఫిక్స‌వుతారు.

అలాంటి టైమ్‌లోనే దివ్య‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు నారాయ‌ణ‌రెడ్డి. ఆమెనే పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స‌వుతాడు. దివ్య‌కు అప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? దివ్య‌కు త‌న ప్రేమ‌ను నారాయ‌ణ రెడ్డి ఎలా వ్య‌క్తం చేశాడు? నారాయ‌ణ రెడ్డి ల‌వ్ రెడ్డిగా ఎలా మారాడు? వారి ప్రేమ క‌థ ఎలా ముగిసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప్ర‌భాస్ ట్వీట్‌...

ల‌వ్ రెడ్డి సినిమాను ఉద్దేశిస్తూ ప్ర‌భాస్ చేసిన ట్వీట్ కార‌ణంగా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఈ చిన్న సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌భాస్ ట్వీట్‌తో మంచి వ‌సూళ్ల‌ను ఈ మూవీ రాబ‌ట్టింది. ల‌వ్‌ రెడ్డి మూవీకి ప్రిన్స్ హెన్నీ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ రిలీజ్ చేసింది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు స్మ‌ర‌ణ్ రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Whats_app_banner