తెలుగు ఇండిపెండెంట్ మూవీ అమృతంగమయ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 49 రూపాయలు రెంట్ చెల్లించి ఈ మూవీని బుక్ మై షో యాప్‌లో చూడొచ్చు.
అమృతంగమయ మూవీలో కిరణ్ కుమార్, మౌనిక సామినేని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి హీరోగా నటించిన కిరణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమ లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో ఓ జంట సాగించిన జర్నీ చుట్టూ దర్శకుడు ఈ మూవీ కథను రాసుకున్నాడు.
అర్జున్, అమృత ఫిల్మ్ మేకర్స్‌గా స్థిరపడాలని కలలు కంటారు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు? ఈ జర్నీలో వారికి ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ ఇండిపెండెంట్ మూవీ రూపొందినట్లు సమాచారం.
అమృతంగమయ రన్ టైమ్ కేవలం 59 నిమిషాలే కావడం గమనార్హం. గంట కంటే తక్కవ రన్‌టైమ్‌తో ఈ మూవీ బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో కిరణ్ కుమార్ ఎఫ్ఎమ్ అనే షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. మౌనిక సామినేని గతంలో సూపర్ మచ్చి అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. వెబ్‌సిరీస్ కంటే ఎక్కువగా సీరియల్స్‌తో ఫేమస్ అయ్యింది. సత్యభామ సీరియల్‌లో మైత్రి అనే క్యారెక్టర్‌లో కనిపించింది. అంతకుముందు వంటలక్క, పడమటి సంధ్యారాగంతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో కనిపించింది.
ఈ వారం అమృతంగమయతో పాటు కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి, సుమంత్ అనగనగా సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి.
అనగనగా మూవీ కూడా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. సుమంత్, కాజల్ చౌదరిజంటగా నటించిన ఈ మూవీ ఓటీటీలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. మరోవైపు కళ్యాణ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలవడంతో నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకలు ముందుకొచ్చింది.
సంబంధిత కథనం