Telugu OTT: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ - షాకింగ్ క్లైమాక్స్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Telugu OTT: తెలుగు మూవీ లవ్ రెడ్డి ఈ వారంలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
Telugu OTT: తెలుగు మూవీ లవ్ రెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 3 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. లవ్ రెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో విడుదలైన రెండున్నర నెలల తర్వాత ఈ తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రభాస్ ట్వీట్...
లవ్ రెడ్డి మూవీలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. స్మరణ్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. లవ్ రెడ్డి సినిమాను ఉద్దేశించి అగ్ర హీరో ప్రభాస్ ట్వీట్ చేయడంతో పాటు వెరైటీ టైటిల్, ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది.
నారాయణరెడ్డి ప్రేమకథ...
పరువు హత్యల నేపథ్యంలో దర్శకుడు స్మరన్ రెడ్డి లవ్ రెడ్డి సినిమాను రూపొందించాడు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లోని ఓ పల్లెటూరికి చెందిన నారాయణరెడ్డి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. కుటుంబం, స్నేహితులే ప్రపంచంగా ఆనందంగా సాగిపోతుంటుంది అతడి జీవితం. 30 ఏళ్లు వచ్చినా నారాయణరెడ్డికి పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటాడు.
అలాంటి టైమ్‌లోనే అతడి జీవితంలోకి దివ్య ఎంట్రీ ఇస్తుంది. తొలిచూపులోనే దివ్యతో ప్రేమలో పడిన నారాయణరెడ్డి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. కానీ దివ్యకు అప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిందనే నిజం బయటపడుతుంది. మరోవైపు నారాయణ రెడ్డి ప్రేమను దివ్య కూడా రిజెక్ట్ చేస్తుంది? పరువు కోసం ప్రాణమిచ్చే దివ్య తండ్రి...నారాయణరెడ్డి ప్రేమ విషయం తెలిసి ఏం చేశాడు? నారాయణ రెడ్డి...లవ్ రెడ్డిగా ఎందుకు మారాడు? చివరకు వారి ప్రేమ కథ ఏమైంది? అన్నదే లవ్ రెడ్డి మూవీ కథ
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
లవ్ రెడ్డి మూవీతోనే హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కంప్లీట్ రాయలసీమ యాసలో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన క్లైమాక్స్‌తో ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు .ఈ మూవీలో నెగెటివ్ క్యారెక్టర్ చేసిన ఎన్‌టీ రామస్వామిపై థియేటర్‌లోనే ఓ అభిమాని దాడిచేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. లవ్ రెడ్డి మూవీలో జ్యోతి మదన్, ఎన్‌టీ రామస్వామి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రిన్స్ హెన్నీ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది.