Romantic Comedy OTT: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ మూవీ - నాలుగు జంటల రొమాన్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రోటి కప్‌డా రొమాన్స్ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీలో హర్ష నర్రా, సుప్రజ్ రంగా, సందీప్ సరోజ్, తరుణ్ హీరోలుగా నటించారు.
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రోటి కప్‌డా రొమాన్స్ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈ తెలుగు మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. రోటి కప్‌డా రొమాన్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
రొమాంటిక్ కామెడీ మూవీ...
ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో హర్ష నర్రా, సుప్రజ్ రంగా, సందీప్ సరోజ్, తరుణ్ హీరోలుగా నటించారు. మేఘలేఖ, నువేక్ష, సోనియా ఠాకూర్, ఖుష్బూ చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
నాలుగు జంటల కథతో...
నవంబర్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాలో కామెడీ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. నాలుగు జంటల కథతో దర్శకుడు విక్రమ్ రెడ్డి రోటి కప్‌డా రొమాన్స్ మూవీని తెరకెక్కించాడు.
ప్రేమ, స్నేహం లాంటి విషయాల్లో నేటితరం ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. మోడ్రన్ రిలేషన్‌షిప్స్‌లో ఉండే అభిప్రాయభేదాలు, వాటి వల్ల వచ్చే కన్ఫ్యూజన్స్‌ను వినోదాత్మకంగా ఈ మూవీలో చూపించాడు. అంతర్లీనంగా ఓ చిన్న మెసేజ్‌ను టచ్ చేశాడు.
నలుగురు స్నేహితుల కథ....
హర్ష (హర్ష నర్రా), రాహుల్ ( సందీప్ సరోజ్), విక్కీ (సుప్రజ్ రంగా), సూర్య (తరుణ్) చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటుంటారు. హర్ష, రాహుల్, సూర్య జాబ్ చేస్తుంటారు. విక్కీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. నలుగురు స్నేహితుల జీవితాల్లో భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు అమ్మాయిలు వస్తారు.
సూర్య ... దివ్య (నువేక్ష) తో... శ్వేతతో (మేఘలేఖ) విక్కీ ప్రేమలో పడతారు. హర్ష లైఫ్‌లోకి సోనియా (ఖుష్బూ చౌదరి) అనుకోకుండా ఎంట్రీ ఇస్తుంది. రాహుల్ ప్రియను (సోనియా ఠాకూర్) ఇష్టపడతాడు.
తమ లైఫ్‌లోకి అమ్మాయిలు వచ్చిన అమ్మాయిల కారణంగా ఆ నలుగురి స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ప్రేమించిన అమ్మాయిలకు వారు ఎందుకు దూరమయ్యారు? బ్రేకప్ తర్వాత హర్ష, రాహుల్, విక్కీ, సూర్య లైఫ్ లైఫ్ ఎలా సాగింది? వారంతా ట్రిప్ కోసం గోవా వెళ్లడానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు...
రోటి కప్‌డా రొమాన్స్ మూవీకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సన్నీ ఎమ్ఆర్, వసంత్ జీ, ఆర్ ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అందించారు.