Romantic Comedy OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Comedy OTT: ఇంద్రజ, కరుణ కుమార్(మట్కా డైరెక్టర్) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ కథా కమామీషు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. నాలుగు జంటల కథతో కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన గురువారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Comedy OTT: ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు కామెడీ మూవీ కథా కమామీషు నేరుగా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కథా కమామీషు మూవీలో మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ కీలక పాత్ర పోషించాడు
వెంకటేష్ కాకుమాను, మెయిన్ మహమ్మద్, హర్షిని ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు గౌతమ్ - కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
నాలుగు కథలతో...
పెళ్లి నేపథ్యంలో నాలుగు కథలతో కథా కమామీషు మూవీ రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీ జోడిస్తూ దర్శకద్వయం ఈ మూవీని తెరకెక్కించారు. సత్య (వెంకటేష్ కాకుమాను) తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది.
అన్నయ్యలతో పాటు తండ్రి ఏ పని పాట లేకుండా సత్య సంపాదనపై ఆధారపడి బతుకుతుంటారు. సత్యకు పెళ్లి కుదురుతుంది. అప్పటి నుంచి సత్యను అతడి అన్నయ్యలతో పాటు తండ్రి ద్వేషించడం మొదలుపెడతారు ఆ తర్వాత ఏమైంది, సత్యతో ఉష పెళ్లి జరిగిందా? లేదా? అన్నది మొదటి కథ.
రమ్మీ ఆట...
రమ్మీ ఆటలో దివ్య చాలా డబ్బులు పొగొడుతుంది. ఎప్పటికైనా పోయిన డబ్బులు గెలిచి చేసిన అప్పును తీర్చేయాలని కలలు కంటుంది. బెంగళూరుకు చెందిన బాలుతో దివ్యకు సంబంధం సంబంధం ఫిక్సవుతుంది. దివ్య చేసిన అప్పులు బయటపడ్డాయా? భిన్న మనస్తత్వాలు కలిగిన బాలు, దివ్య ఎలా ఒక్కటయ్యారు అన్నది మరో కథ.
పోలీస్ ఆఫీసర్‌తో పెళ్లి...
కల్పన (ఇంద్రజ) పోలీస్ ఆఫీసర్. భర్త చనిపోతాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని శ్రీధర్ అనుకుంటాడు. శ్రీధర్‌కు అప్పటికే పెళ్లవుతుంది. కల్పన రఫ్ అయితే శ్రీధర్ చాలా సాఫ్ట్. వారి పెళ్లి చూపులు స్టేషన్లోనే ఎలా జరిగాయి? కొడుకుల సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి లైఫ్ ఎలా సాగింది? అన్నది కథా కమామీషులో చూపించారు డైరెక్టర్లు.
ఓ యువ జంటది మరో కథ. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ తీసుకెళ్లాలని అనుకుంటాడు. డబ్బుల కోసం అతడు ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్నది వినోదాత్మకంగా గౌతమ్ - కార్తీక్ ఆవిష్కరించారు.
ఈ సినిమాలో ఇంద్రజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకునే వ్యక్తిగా మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ నటించాడు. కథా కమామీషు సినిమాలో శృతి రాయ్, జెమిని సురేష్, కృతిక, కృష్ణ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ అందించాడు.
హీరోయిన్‌గా...
హీరోయిన్‌గా తెలుగులో పిట్టలదొర, చిలక్కొట్టుడు, పెద్దన్నయ్య, చిన్నబ్బాయితో పాలు పలు సినిమాలు చేసింది ఇంద్రజ. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఇంద్రజ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్ధస్థ్‌తో పాటు మరికొన్ని టీవీ షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.