ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..-telugu psychological thriller rakshasudu trending ahead of horror thriller kishkindhapuri ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..

ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి రాబోతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు ముందు ఆరేళ్ల కిందటి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్ లో ఉంది. అందులోనూ అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ నటించారు.

ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. ఈ మూవీ అక్టోబర్ 17న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే దాని కంటే ముందు ఈ ఇద్దరే కలిసి నటించిన రాక్షసుడు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

ట్రెండింగ్‌లో రాక్షసుడు మూవీ

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ రాక్షసుడు. 2019లో థియేటర్లలో రిలీజైంది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అప్పట్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 'రాక్షసుడు' సినిమా శ్రీనివాస్ కెరీర్‌లోని మొదటి ప్రధాన హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అతన్ని ఇంటింటికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా విజయం అనుపమ పరమేశ్వరన్‌కు కూడా తెలుగు సినిమాలో మంచి స్థానాన్ని పదిలం చేసింది.

ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వార్తల్లో ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు జోరందుకున్నాయి. శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ చేసినప్పుడల్లా అది అతనికి అద్భుతాలు చేసిందని అభిమానులు గుర్తుచేస్తున్నారు. 'రాక్షసుడు' కథ ఒక రహస్య వ్యక్తి వరుసగా పిల్లలను చంపడం, అతన్ని శ్రీనివాస్ పాత్ర ఎలా ట్రాక్ చేస్తుందనే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది. ఫ్రీగానే చూడొచ్చు.

'కిష్కిందపురి' బాక్సాఫీస్ కలెక్షన్లు

ఇక అనుపమ, శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమా అక్టోబర్ 10న ఓటీటీలోకి వస్తుందని భావించినా.. అక్టోబర్ 17న రానుందని అంటున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మరోవైపు ట్రాకింగ్ పోర్టల్ Sacnilk ప్రకారం 'కిష్కింధపురి' మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అదే రోజు విడుదలైన 'మిరాయ్' సినిమా హైప్ కారణంగా చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. అందుకే దీని ఓటీటీ రిలీజ్ పై బలమైన బజ్ ఉంది.

'పరదా' సినిమాతో భారీ ఫ్లాప్‌ను చవిచూసిన అనుపమ పరమేశ్వరన్.. 'కిష్కింధపురి' తో బలంగా తిరిగి పుంజుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రీమియర్ అయిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం