Psychological Thriller OTT: రెండు ఓటీటీల్లోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Psychological Thriller OTT:వరలక్షి శరత్ కుమార్ శబరి మూవీ థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత లోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో అనిల్ కాట్జ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Psychological Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
త్వరలోనే శబరి ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6 నుంచి ఈ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలిసింది.
సైకలాజికల్ థ్రిల్లర్...
శబరి సినిమాతో అనిల్ కాట్జ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే 3న థియేటర్లలో శబరి మూవీ రిలీజైంది. శబరికి పోటీగా పలు సినిమాలు రిలీజ్ కావడం, రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
సంజన గతం ఏమిటి?
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్) అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం తెలిసి భర్తకు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష) కలిసి బతకాలని నిర్ణయించుకుంటుంది సంజన.
ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు స్నేహితుడైన లాయర్ రాహుల్ (శశాంక్) సహాయంతో జుంబా ట్రైనర్‌గా ఓ జాబ్ సంపాదిస్తుంది సంజన. మరోవైపు సంజన ఆచూకీ కోసం సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వెతుకుతుంటాడు. సూర్య బారి నుంచి తనతో పాటు కూతురిని కాపాడుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంజన. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తేలుతుంది. సంజననే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్ధారిస్తారు.
క్రిమినల్ అయిన సూర్య సంజన కోసం ఎందుకు వెతుకుతున్నాడు? నిజంగానే సూర్య చనిపోయాడా? భర్త అరవింద్‌కు సంజన ఎందుకు దూరమైంది? కూతురు రియా గురించి సంజన తెలుసుకున్న నిజం ఏమిటన్నదే ఈ మూవీ కథ.
లాజిక్స్ మిస్....
శబరి సినిమాలో సంజన పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. కథలో కొన్ని ట్విస్ట్‌లు బాగున్నా లాజిక్స్ మిస్స్ కావడం, సెకండాఫ్‌లో సాగతీత ఎక్కువగా ఉండటంతో శబరి ఫెయిల్యూర్‌కు కారణమైంది.
కూర్మనాయకితోపాటు...
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ ఏడాది పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తెలుగు మూవీ హనుమాన్‌లో హీరో తేజా సజ్జా సోదరిగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఆమె హీరోయిన్‌గా తెలుగుతో కూర్మనాయకితో పాటు మరో మూడు సినిమాలు రాబోతున్నాయి.
ఇటీవల రిలీజైన ధనుష్ రాయన్‌లో ఓ కీలక పాత్రలో తళుక్కున మెరిసింది. కన్నడంలో కిచ్చా సుదీప్‌తో మ్యాక్స్ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తోంది.సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. తెలుగులో అద్ధం, మ్యాన్షన్ 24 వెబ్‌సిరీస్‌లు చేసింది.