Telugu Programs TRP Ratings: తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. బిగ్ బాస్ హవా-telugu programs trp ratings bigg boss tops the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Telugu Programs Trp Ratings Bigg Boss Tops The List

Telugu Programs TRP Ratings: తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. బిగ్ బాస్ హవా

Hari Prasad S HT Telugu
Nov 14, 2023 01:47 PM IST

Telugu Programs TRP Ratings: తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్ బాస్ 7 తెలుగు తన హవా కొనసాగిస్తోంది. తొలి రెండు స్థానాల్లో ఈ రియాల్టీ షోనే ఉండటం విశేషం.

స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు
స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు

Telugu Programs TRP Ratings: తెలుగు టీవీ ఛానెల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ మరోసారి సత్తా చాటింది. ఎప్పటిలాగే టాప్ 10లో స్టార్ మా, ఈటీవీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఎపిసోడ్లే తొలి రెండు స్థానాల్లో ఉండటం విశేషం. టాప్ 10లో తొలి మూడు స్థానాల్లో స్టార్ మా ప్రోగ్రామ్సే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

సాధారణంగా టీవీ సీరియల్స్ లో టీఆర్పీలను డామినేట్ చేసే స్టార్ మా.. ఇప్పుడు ప్రోగ్రామ్స్ లోనూ సత్తా చాటుతోంది. ఈటీవీ టాప్ ప్లేస్ కోల్పోయింది. అయితే టాప్ 10లో 4 నుంచి 10 వరకూ ఏడు స్థానాల్లోనూ ఆ ఛానెల్ కు సంబంధించిన ప్రోగ్రామ్సే ఉన్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలు ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉన్నాయి.

తాజాగా బార్క్ వెబ్‌సైట్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3తో ముగిసిన వారానికి సంబంధించిన రేటింగ్స్ రిలీజ్ చేసింది. అర్బన్, రూరల్ రేటింగ్స్ కలిపి టాప్ 10 ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.

టాప్ 10 తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ఇవే

1. బిగ్ బాస్ 7 తెలుగు (వీకెండ్) (స్టార్ మా) - 6.9 టీఆర్పీ

2. బిగ్ బాస్ 7 తెలుగు (వీక్ డేస్) (స్టార్ మా) - 4.91 టీఆర్పీ

3. ఆదివారం విత్ స్టార్ మా పరివారం (స్టార్ మా) - 4.24 టీఆర్పీ

4. శ్రీదేవి డ్రామా కంపెనీ (ఈటీవీ) - 3.54 టీఆర్పీ

5. ఎక్స్‌ట్రా జబర్దస్త్ (ఈటీవీ) - 3.34 టీఆర్పీ

6. జబర్దస్త్ (ఈటీవీ) - 3.00 టీఆర్పీ

7. ఢీ ప్రీమియర్ లీగ్ (ఈటీవీ) - 2.46 టీఆర్పీ

8. సుమ అడ్డా (ఈటీవీ) - 2.01 టీఆర్పీ

9. అలీతో ఆల్ ఇన్ వన్ (ఈటీవీ) - 1.97 టీఆర్పీ

10. పాడుతా తీయగా (ఈటీవీ) - 1.73 టీఆర్పీ

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.