Telugu OTT: ఓటీటీలోకి వచ్చిన జబర్ధస్థ్ కమెడియన్ పొలిటికల్ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Telugu OTT: జబర్ధస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేసీఆర్ మూవీతో సీనియర్ నటి సత్యకృష్ణన్ తనయ అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Telugu OTT: జబర్ధస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించాడు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీరాభిమాని అయిన ఓ లాంబాడీ యువకుడి జర్నీతో ఈ మూవీ తెరకెక్కింది.
కేసీఆర్ మూవీతో సీనియర్ నటి సత్య కృష్ణన్ తనయ అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఈ పొలిటికల్ డ్రామా మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే ఈ సినిమాను రాకింగ్ రాకేష్ స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు.
రాకింగ్ రాకేష్ భార్య...
నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన కేసీఆర్ మూవీ నైజాం ఏరియాలో మోస్తారు వసూళ్లను రాబట్టింది. కేసీఆర్ మూవీలో రాకింగ్ రాకేష్ సతీమణి జోర్దార్ సుజాతతో మైమ్‌మధు, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.
కేసీఆర్ మూవీ కథ ఇదే...
వరంగల్ జిల్లాలోని రంగబాయి తండాకు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్) ఓ లాంబాడీ యువకుడు. కేసీఆర్‌కు వీరాభిమాని. తండావాసులంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ప్రాణంగా ప్రేమిస్తుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.
తన పెళ్లి అభిమాననాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర రమావత్ నిర్ణయించుకుంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. లంబాడీ తండా నుంచి హైదరాబాద్ వచ్చిన కేశవ చంద్ర రమావత్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. కేశవ చంద్ర రమావత్.... కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యను కేశవ చంద్ర రమావత్ ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా ? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సీక్వెల్....
కేసీఆర్ మూవీతోనే రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు కేసీఆర్ 2 పేరుతో సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు ఇటీవలే రాకింగ్ రాకేష్ ప్రకటించాడు. గతంలో మాధవే మధుసూదన, డ్రీమ్‌బాయ్‌తో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో రాకింగ్ రాకేష్ కమెడియన్‌గా కనిపించాడు. ఇటీవల స్టార్ మాలో ప్రారంభమైన ఐకాన్ జోడీలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు.