Harom Hara OTT: ఎట్టకేలకు ఓటీటీలో సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ మొదలు.. ఎక్కడ చూడొచ్చు?-telugu period action thriller movie harom hara streaming on aha ott platform sudheer babu film harom hara ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harom Hara Ott: ఎట్టకేలకు ఓటీటీలో సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ మొదలు.. ఎక్కడ చూడొచ్చు?

Harom Hara OTT: ఎట్టకేలకు ఓటీటీలో సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ మొదలు.. ఎక్కడ చూడొచ్చు?

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 16, 2024 01:36 PM IST

Harom Hara OTT Release: హరోం హర చిత్రం కొన్ని ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందుగానే డేట్ ప్రకటించనా స్ట్రీమింగ్ ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

Action Thriller OTT: ఎట్టకేలకు ఓటీటీలో సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ మొదలు.. ఎక్కడ చూడొచ్చు? వచ్చే వారం ఇంకో ఓటీటీలో..
Action Thriller OTT: ఎట్టకేలకు ఓటీటీలో సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ మొదలు.. ఎక్కడ చూడొచ్చు? వచ్చే వారం ఇంకో ఓటీటీలో..

యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ హరోం హర సినిమా థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఈ చిత్రం జూన్ 14న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రంలో హీరోగా నటించిన సుధీర్ బాబు ఖాతాలో మరో ప్లాఫ్ పడింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. హరోం హర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ట్విస్టులు ఎదురయ్యాయి. తొలుత ప్రకటించిన తేదీకి స్ట్రీమింగ్‍కు రాలేదు. అయితే, నేడు ఓ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

ఆహాలో స్ట్రీమింగ్‍

హరోం హర సినిమా నేడు (జూలై 15) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్‍కు తీసుకొస్తున్నట్టు నేడు సడెన్‍గా సర్‌ప్రైజ్ చేసింది ఆహా. సాయంత్రం 5 గంటలకు స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది. అయితే, అంత కంటే ముందే అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 11నే ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు అడుగుపెట్టింది.

హరోం హర స్ట్రీమింగ్‍ మొదలైన విషయాన్ని సోషల్ మీడియాలోనూ ఆహా వెల్లడించింది. “ఇగ దినాము దీపావళే! సుబ్రహ్మణ్యం ఎంటరైనాడబ్బీ” అంటూ చిత్తూరు యాసలో ట్వీట్ చేసింది. హరోం హర మూవీకి కుప్పం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చింది.

మరో ఓటీటీలో..

హరోం హర సినిమాను జూలై 11వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలు ఇటీవలే ప్రకటించాయి. అయితే, ప్రణీత్ హనుమంతు వివాదంతో స్ట్రీమింగ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 18వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ ఇటీవలే ప్రకటించింది. అయితే, ఆహా మాత్రం నేడు సడెన్‍గా ఈ మూవీని స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వచ్చే వారం ఈటీవీ విన్ ఓటీటీలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఆహా ఇప్పటికే తీసుకొచ్చిన నేపథ్యంలో ఈటీవీ విన్ కూడా జూలై 18 కంటే ముందే హరోం హరను అందుబాటులోకి తెస్తుందా.. ఆరోజునే స్ట్రీమింగ్‍కు తెస్తుందా అనేది చూడాలి. విదేశాల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది.

వాయిదా ఎందుకంటే..

హరోం హర సినిమా జూలై 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉండగా.. ఆఖరి నిమిషాల్లో వాయిదా పడింది. ఆహా, ఈటీవీ విన్ స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. అయితే, వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారమే ఇందుకు కారణమని తెలిసింది. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై అసభ్యకరమైన కామెంట్లు చేశాడు ప్రణీత్. దీంతో అతడు అరెస్ట్ అయ్యాడు. బాలికపై ప్రణీత్ కామెంట్లపై హీరో సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ప్రణీత్ నటించిన సీన్లను కట్ చేసి.. ఓటీటీలోకి తీసుకురావాలని మూవీ టీమ్ నిర్ణయించింది. అందుకే ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆహాలో నేడు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

హరోం హర మూవీకి జ్ఞానస్వాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. చిత్తూరు బ్యాక్‍డ్రాప్‍లో అక్రమ తుపాకుల వ్యాపారం చుట్టూ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ, సునీల్ కూడా మెయిన్ రోల్స్ చేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకం ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది.

Whats_app_banner