OTT Telugu Releases this week: గత వారం అతివృష్టి.. ఈవారం అనావృష్టి.. ఓ తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి.. మరొకటి డబ్బింగ్
OTT Telugu Releases This Week: ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి పెద్దగా లేదు. గత వారం చాలా చిత్రాలు స్ట్రీమింగ్‍కు రాగా.. ఈ వారం పెద్దగా రిలీజ్‍లు లేవు. కాగా, ఆహాలో ఓ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది.
OTT Telugu Release: గత వారం (ఏప్రిల్ రెండో వారం) ఓటీటీల్లోకి చాలా చిత్రాలు వచ్చాయి. సూపర్ హిట్ మూవీలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. ఓం భీమ్ బుష్, గామి సహా మరిన్ని పాపులర్ చిత్రాలు వచ్చాయి. అయితే, ఈ వారం మాత్రం కొత్తగా ఓటీటీల్లో తెలుగు రిలీజ్‍లు చాలా తక్కువగా ఉన్నాయి. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు రానుండగా.. సైరన్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి రానుంది. గత వారం అతివృష్టిగా చాలా తెలుగు చిత్రాలు ఓటీటీల్లోకి రాగా.. ఈ వారం అనావృష్టి అన్నట్టు తక్కువగా వస్తున్నాయి. ఆ వివరాలివే..
మై డియర్ దొంగ
మై డియర్ దొంగ సినిమా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈవారం ఏప్రిల్ 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఇప్పటికే అధికారికంగా ఖరారు చేసింది. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ అభిమన్ గోమటం, షాలినీ కండేపూడి, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ఫన్నీ దొంగగా అభినవ్ నటించారు. ఈ మూవీ టీజర్ కూడా ఆకట్టుకుంది.
మై డియర్ దొంగ చిత్రానికి బీఎస్ సర్వాంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. షాలినీ కండేపూడి స్క్రిప్ట్ అందించారు. క్యామ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఈ మూవీని మహేశ్వర రెడ్డి గోజల నిర్మించారు. ఏప్రిల్ 19 నుంచి మై డియర్ దొంగ మూవీని ఆహా ఓటీటీలో చూసేయవచ్చు.
సైరన్ సినిమా
జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘సైరన్’ అనే తమిళ మూవీ ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయింది. చాలా వాయిదాల తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విడుదలైంది. ఈవారంలో ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో సైరన్ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్‍లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
సైరన్ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పర్పాలేదనిపించింది. ఈ మూవీకి సముద్రఖని, యోగిబాబు, అళగమ్ పరుమాళ్, అజయ్ కీరోల్స్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్, సామ్ సీఎస్ సంగీతం అందించారు. సైరన్ మూవీని హోమ్ మూవీస్ మేకర్స్ పతాకంపై సుజాత విజయ్‍కుమార్ ప్రొడ్యూజ్ చేశారు.
యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలో పోషించిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370.. ఏప్రిల్ 19వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, తెలుగు వెర్షన్ వస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
గత వారం తెలుగు ఓటీటీ రిలీజ్‍లు
ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీల్లోకి తెలుగులో పాపులర్ సినిమాలు వచ్చాయి. థియేటర్లలో హిట్ అయిన ఓం భీమ్ బుష్ చిత్రం ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రాగా.. గామి సినిమా జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. మలయాళ సూపర్ హిట్ ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 12నే వచ్చింది. ఈ చిత్రం మలయాళం, తమిళం, హిందీ వెర్షన్లు అదేరోజున డిస్నీప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టాయి. ఏప్రిల్ 12న నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన హిందీ మూవీ అమర్ సింగ్ చమ్కీలా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.