ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో సైకలాజికల్, హారర్, లీగల్, ఇన్వెస్టిగేటివ్, మైథలాజికల్ వంటి అనేక రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
తేజ సజ్జా, మంచు మనోజ్ హీరో విలన్‌గా నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీలో తెరకెక్కన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. కొంకణ సేన్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్టోబర్ 10 నుంచి హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో సెర్చ్ ఓటీటీ రిలీజ్ అయింది.
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్, సాంచి రాయ్, వీటీ గణేష్, సత్యం రాజేష్ నటించిన సోషియో ఫాంటసీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన త్రిబాణధారి బార్బరిక్ సన్ నెక్ట్స్ ఓటీటీలో తెలుగులో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ది ఉమెన్ క్యాబిన్ 10. అక్టోబర్ 10 నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో ది ఉమెన్ క్యాబిన్ 10 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
హిస్టారికల్ మైథలాజికల్ వార్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెక్కిన యానిమేషన్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర. మహాభారతంలోని కురుక్షేత్ర అధ్యాయం ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో తెరకెక్కిన లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లీగల్లీ వీర్. మాలిక్ రెడ్డి, ప్రియాంక రెవ్రీ, తనూజ పుట్టస్వామి, దయానంద్ రెడ్డి, జయశ్రీ రాచకొండ నటించిన థ్రిల్లర్ సినిమా లీగల్లీ వీర్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఇంటు ది డీప్. మనుషులను తినే తిమింగాళల నుంచి సముద్రంలో ఎలా తప్పించుకున్నారనే థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు భాషలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అయితే, ఈ 7 తెలుగు ఓటీటీ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా, స్పెషల్‌గా మిరాయ్, త్రిబాణధారి బార్బరిక్, సెర్చ్, కురుక్షేత్ర వంటి నాలుగు సినిమాలు ఉండటం విశేషం.
సంబంధిత కథనం
టాపిక్