గ‌రుడపురాణం ఆధారంగా య‌ముడు - స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్ - అప‌రిచితుడు 2 లాంటి సినిమా-telugu mythological movie yamudu set to release soon in theaters shoot wrap up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గ‌రుడపురాణం ఆధారంగా య‌ముడు - స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్ - అప‌రిచితుడు 2 లాంటి సినిమా

గ‌రుడపురాణం ఆధారంగా య‌ముడు - స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్ - అప‌రిచితుడు 2 లాంటి సినిమా

Nelki Naresh HT Telugu

మైథ‌లాజిక‌ల్ క‌థ‌తో రూపొందిన య‌ముడు మూవీ కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. య‌ముడు మూవీలో హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు జ‌గ‌దీష్ ఆమంచి. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

య‌ముడు మూవీ

టాలీవుడ్‌కు య‌ముడి సెంటిమెంట్ బాగా క‌లిసొచ్చింది. య‌ముడి నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ దాదాపు హిట్ట‌య్యాయి. య‌మ‌గోల‌, య‌ముడికి మొగుడు, య‌మ‌దొంగ‌తో పాటు ప‌లు సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి. కొంత గ్యాప్ త‌ర్వాత య‌ముడి క‌థ‌తో తెలుగులో ఓ మూవీ రాబోతుంది.

స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో...

జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో య‌ముడు మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.య‌ముడు మూవీకి సంబంధించి కొత్త పోస్ట‌ర్‌ను శ‌నివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఉన్న ధర్మో రక్షతి రక్షితః అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

య‌మ‌పాశంతో...

ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో హీరో జగదీష్ క‌నిపిస్తోన్నాడు. అత‌డి వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఆక‌ట్టుకుంటున్నాయి. హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేయ‌టం ఆస‌క్తిని పంచుతోంది. య‌ముడికి, హీరోయిన్‌కు ఉన్న లింకేంటి అన్న‌ది స‌స్పెన్స్ అని మేక‌ర్స్ చెబుతోన్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు అంత‌ర్లీనంగా మైథ‌లాజిక‌ల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయ‌ని చెబుతోన్నారు.

గ‌రుడ పురాణం...

గ‌రుడ పుర‌ణానికి సంబంధించిన ప్ర‌స్తావ‌న ఈ మూవీలో ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. భూలోకంలో పాపాలు చేసిన వారికి గ‌రుడ పురాణం ఆధారంగా య‌ముడు ఎలాంటి శిక్ష‌లు విధిస్తాడ‌నే అంశాల‌తో ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారు ఈ సినిమా తీసి ఉంటే దీనికి అప‌రిచితుడు 2 అని పెట్టేవారు అని డైరెక్ట‌ర్ జ‌గ‌దీష్ ఆమంచి పేర్కొన్నారు. అప‌రిచుతుడు మూవీలో గ‌రుడ‌పురాణం, శిక్ష‌ల‌కు సంబంధించి పాయింట్ ఉంటుంది. ఈ సినిమా పాయింట్ అదే అయినా చూపించిన విధానం మాత్రం కొత్త‌గా ఉంటుంద‌ని అన్నారు.

షూటింగ్ కంప్లీట్‌...

య‌ముడు మూవీ షూటింగ్ పూర్తయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌ను జ‌రుపుతోన్నారు. త్వరలోనే య‌ముడు మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ల‌భించింది. ఆకాశ్ చల్లా మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాకు భ‌వానీ రాకేష్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. య‌ముడు మూవీకి హీరోగానే, డైరెక్ట‌ర్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా జ‌గ‌దీష్ ఆమంచి వ్య‌వ‌హ‌రిస్తోండ‌టం గ‌మ‌నార్హం. హ‌రి అల్ల‌సానితో క‌లిసి క‌థ‌ను కూడా అందించాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం