Mythological Movie: మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్‌తో కర్మస్థలం - మైథలాజికల్ మూవీతో అర్చన రీఎంట్రీ!
Mythological Movie: మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ మైథలాజికల్ మూవీ రాబోతుంది. ఈ సినిమా ద్వారా అర్చన కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. రాకీ షెర్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథలాజికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, ఇతిహాస గాథలను సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ పౌరాణిక కథల్లో నటించేందుకు స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతోన్నారు.

టాలీవుడ్‌లోకి రీఎంట్రీ...
తాజాగా మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్‌తో తెలుగులో కర్మస్థలం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ అర్చన కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి రాకీ షెర్మన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కర్మస్థలం మూవీలో అర్చన తో పాటు మిథాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియన్ మూవీని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపిస్తోంది. పోస్టర్‌లో ముఖాలకు నల్లటి ముసుగులు ధరించి అర్చన, మిథాలి చౌహాన్ కనిపిస్తోన్నారు.
స్పెషల్ మూవీ...
ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌లో అర్చన మాట్లాడుతూ ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో కర్మస్థలం మూవీ తెరకెక్కుతోంది. ఈ కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తాడో అని సందేహపడ్డా. . కానీ కథను అద్భుతంగా చెప్పడమే కాదు స్క్రీన్‌పై కూడా చెప్పినదానికంటే బాగా తెరకెక్కించాడు. కర్మస్థలం నా కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచింది. నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా ఇది. ఫైట్ సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌ను పంచుతాయి" అని అన్నది.
పాన్ ఇండియా రేంజ్‌లో...
దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం ఈ పాటికే థియేటర్లలోకి రావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపాడు.
పాటలు చాలా బాగా వచ్చాయని, త్వరలో ఒక్కో పాటను రిలీజ్ చేస్తామని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా చెప్పాడు. తెలుగులో ఇంత వరకు కర్మస్థలం టైటిల్‌తో ఎవరూ సినిమా చేయలేదని యాక్టర్ దిల్ రమేష్ అన్నాడు.
నేను మూవీతో…
అల్లరి నరేష్ నేను మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అర్చన. వేద పేరుతో ఈ మూవీ చేసింది. ఆ తర్వాత తన పేరును అర్చనగా మార్చుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, యమదొంగ, ఖలేజాతో పాటు పలు భారీ బడ్జెట్ మూవీలో విభిన్నమైన క్యారెక్టర్స్ చేసింది. హీరోయిన్‌గా పలు చిన్న సినిమాల్లో కనిపించింది.