OTT Telugu Web series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vikkatakavi OTT Release date: వికటకవి వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఈ నెలలోనే రాబోతోంది. తెలుగులో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులైంది. దాంతో ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వికటకవి: ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి’ ఓటీటీలో స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలవగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలోని అమరగిరి అనే ప్రదేశం చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించే కథే ఈ వికటకవి. ఈ వెబ్ సిరీస్‌లో షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, ముక్తార్ ఖాన్, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ట్విస్ట్‌లతో థ్రిల్
సిరీస్ చివర్లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఒక పురాతన ఆలయానికి సంబంధించిన ట్విస్ట్ ఉంటుందని యూనిట్ చెప్తోంది. డిటెక్టివ్ రామకృష్ణ (నరేష్ అగస్త్య) చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. సిరీస్ సాంతం ట్విస్ట్‌లతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
మిస్టరీ, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు లేదా సినిమాలు ఇష్టపడే వారికి వికటకవి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. కేవలం 12 రోజుల్లోనే 3.3 మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో వచ్చాయి.
జీ5లో వికటకవి స్ట్రీమింగ్
వికటకవి జీ5లో నవంబర్ 28, 2024 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. అయితే.. సిరీస్‌లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయనే విషయం మాత్రం బయటికి రావడం లేదు. ఎపిసోడ్స్‌పై క్లారిటీ రావాలంటే నవంబరు 28 వరకూ ఆగాల్సిందే. తెలుగులోనే కాదు తమిళ్‌లోనూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్‌కానుంది.